News
News
X

Sajjala ON BRS : కేసీఆర్ మద్దతు అడిగితే చర్చించి నిర్ణయం - ఏపీ బయట వైఎస్ఆర్‌సీపీ ఎక్కడా పోటీ చేయదని సజ్జల క్లారిటీ !

కేసీఆర్ అడిగితే బీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాము ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం లేదన్నారు.

FOLLOW US: 
Share:

Sajjala ON BRS :  ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ పోటీ చేయడం మంచిదేనని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. విభజన తర్వాత తాము ఏపీకి మాత్రమే పరిమితం కావాలనుకున్నామని అందుకే తెలంగాణలో పోటీ చేసే ఆలోచన చేయడం లేదన్నారు. భారత రాష్ట్ర సమితికి మద్దతు కావాలని కేసీఆర్ .. సీఎం జగన్ ను అడిగితే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే కానీ తాము ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల్ తెలిపారు. 

ఏపీ తప్ప ఏ రాష్ట్రంలోనూ పోటీ చేసేది లేదని సజ్జల క్లారిటీ 

మరో వైపు కర్ణాటకలో కూడా వైఎస్ఆర్‌సీపీ పోటీ చేయబోతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ ఊహాగానాలేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము కర్ణాటకలో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అలా అనుకుంటే తమిళనాడులోనూ పోటీ చేయవచ్చన్నారు. అసలు తెలంగాణనే వద్దనుకుని ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు  పోటీ చేస్తామని ప్రశ్నించారు. 

కేసీఆర్ మద్దతు అడిగితే పార్టీలో చర్చించి నిర్ణయం 

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో  వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే తెలంగాణలో రాజకీయ పోరాటం చేస్తున్న జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కనీసం సంఘిభావం  చెప్పడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. షర్మిలపై నర్సంపేటలో రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత ఆమెను రెండు సార్లు అరెస్ట్ చేశారు. ఓ సారి ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆస్పత్రి పాలయ్యారు. అయినప్పటికీ వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి ఎలాంటి సానుభూతి కానీ మద్దతు కానీ లభించలేదు. స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించలేదు. వైఎస్ షర్మిలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రోజున.. అక్కడి రాజకీయాలతో తమకు ఏం సంబంధం లేదని సజ్జల స్పష్టం చేశారు.

కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు

ఇక జాతీయ రాజకీయాల్లో రాణించడానికి బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్‌సీపీతో కలిసి పని చేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో ఏపీ ప్రత్యేకహోదాకు కేసీఆర్ మద్దతు పలికారు. గత ఎన్నికలకు ముందు ఏపీ, తెలంగాణకు చెందిన 42 మంది ఎంపీలు కలసి కట్టుగా పని చేస్తే.. కేంద్రం మెడలు వంచవచ్చని.. ఏపీ ప్రత్యేకహోదాకు తాము మద్దతునిస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ అంశంపై రెండు పార్టీల ఎంపీలు పెద్దగా స్పందించలేదు. కేంద్రానికి ఎవరి మద్దతూ అవసరం లేకపోవడమే దీనికి కారణం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కలసి కట్టుగా ఉంటే.. కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్న ఆలోచన.. రెండు పార్టీల నేతల్లో ఉందని ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో... పొత్తుల మాటే ఉండదని సజ్జల చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

Published at : 12 Dec 2022 01:59 PM (IST) Tags: AP Politics BRS Sajjala Sajjala Clarity on alliance with BRS

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు, 40కి పైగా బృందాలు రంగంలోకి

Breaking News Live Telugu Updates: వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు, 40కి పైగా బృందాలు రంగంలోకి

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ

AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ

Weather Latest Update: రేపు తీరం దాటనున్న వాయుగుండం, ఏపీలో ఈ ఏరియాల్లో వర్షాలు పడే ఛాన్స్!

Weather Latest Update: రేపు తీరం దాటనున్న వాయుగుండం, ఏపీలో ఈ ఏరియాల్లో వర్షాలు పడే ఛాన్స్!

AP PM Kisan : ఏపీలో సగం మంది రైతులకు పీఎం కిసాన్ తొలగింపు - ఇంత మందిని ఎందుకు తగ్గించారంటే ?

AP PM Kisan : ఏపీలో సగం మంది రైతులకు పీఎం కిసాన్ తొలగింపు - ఇంత మందిని ఎందుకు తగ్గించారంటే ?

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు- రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్, ఆప్

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు- రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్, ఆప్