అన్వేషించండి

Palnadu politics : పల్నాడు వైసీపీ నేతల మధ్య చిచ్చు - జంగా, అనిల్ కుమార్ మాటకు మాట !

Palnadu politics : అనిల్ కుమార్, జంగా కృష్ణమూర్తి మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్నారు. జగన్ తీరును జంగా విమర్శిస్తే అనిల్ కుమార్ మండిపడ్డారు.

Palnadu politics :  పల్నాడులో వైసీపీ నేతల మధ్య రాజకీయ చిచ్చు రేగింది.  నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయనున్న అనిల్ కుమార్ యాదవ్ .. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిపై విమర్శలు చేశారు. దీనిపై జంగా కృష్ణమూర్తి స్పంిదంచారు.  మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని  జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు.  సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం తనది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం తనకు లేదని తెలిపారు. అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. 

2014లో తనను ఎవరు ఓడించారో కూడా తెలుసని పేర్కొన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఉంది.. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పదవి ఉందని చెప్పారు. ఐనా తాను నిజాలే మాట్లాడుతానని.. జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు చెప్పే తత్వం తనదని అన్నారు. బీసీలకు పదవి ఇవ్వలేదని తాను అనలేదు.. ఆ పదవులకు పవర్ లేదని చెప్తున్నానని పేర్కొన్నారు. బీసీ ప్రతినిధులకు వైసీపీలో గౌరవం లేదని ఆయన ఆరోపించారు. 1985 నుండి తాను రాజకీయాల్లో ఉన్నానని.. అనిల్ కుమార్ 2009లో రాజకీయాలు ప్రారంభించావని.. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.                                         

అంతకుముందు.. అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని, అలాంటి నాయకుల్లో జంగా కూడా ఉన్నారని ఆరోపించారు. ఫేక్ నాయకులే పార్టీలను మారతారంటూ మండిపడ్డారు. జగన్‌ను అభిమానించేవారు ఎప్పటికీ పార్టీ మారబోరని, కనీసం ఆ ఆలోచన కూడా చేయరని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. జంగా కృష్ణమూర్తికి 2014లో టికెట్ ఇచ్చారని, ఆ ఎన్నికల్లో ఓడిపోతే అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చారని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని జంగా కృష్ణమూర్తికి కూడా జగన్ చెప్పారని, ఆయన వద్దనుకుంటేనే తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు.                              

వైసీపీలో బీసీలకు ప్రాధాన్యత లేదనడం సరికాదన్నారు. సీఎం జగన్ ద్వారా బాగా సంపాదించుకొని మళ్లీ ఆయనను విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని ఫైర్‌ అయ్యారు. నాలుగున్నరేళ్లు జగన్ దేవుడిలా కనిపించారు.. జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారు.. పార్టీని వీడేటప్పుడు మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వైసీపీ 2014లో జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చింది.. అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.. సీఎం జగన్ ఏమి చేయలేదో చెప్పాలి? అని జంగా కృష్ణమూర్తిని నిలదీశారు.                     

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget