News
News
X

Independence Day 2022: కోనసీమ జిల్లాలో వినూత్నంగా స్వాతంత్ర్య దినోత్సవం, నాణెేలతో దేశ చిత్రపటం!

Independence Day 2022: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఓ బ్యాంక్ ఉద్యోగి తాను సేకరించిన నాణేలతో దేశ చిత్రపటాన్ని తయారు చేశారు. 

FOLLOW US: 

Independence Day 2022: దేశభ‌క్తిని చాటుకోవడంలో ఒక్కొక్క‌రిది ఒక్కో ప‌ద్ద‌తి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav)లో భాగంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా మంది రక రకాలుగా తమ దేశ భక్తిని చాటుతున్నారు. డీపీలు మార్చడం నుండి జెండాకు సెల్యూట్ చేస్తూ, భారీ జెండా ప్రదర్శిస్తూ, జెండూ ఊపుతూ తమ దేశ భక్తిని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్ర‌ధాన కేంద్ర‌మైన అమ‌లాపురానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి వినూత్న రీతిలో తన దేశ భక్తిని చాటారు. 

నాణేలతో దేశ చిత్రపటం..

దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెప రెపలాడేలా జెండా ఎగురవేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుకు ప్రతి ఒక్కరూ స్పందించారు. ఇళ్లపైనే కాకుండా, వాహనాలపైనా జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సంబరాల్లో భాగంగా.. 75 అడుగులు పొడవుతో భారత దేశ చిత్ర పటాన్ని రూపొందించారు అమలాపురం స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఇవటూరి సుబ్రహ్మణ్యం. పూర్తిగా నాణేలతో.. రూపాయి, రెండు, ఐదు రూపాయల బిల్లలతో చిత్ర పటాన్ని రూపొందించి ఆకట్టుకున్నారు. 

దాచుకున్న నాణేలతో..

స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఇవ‌టూరి సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఒక హాబీ ఉంది. ఆయనకు నాణాలు దాచుకోవ‌డం అంటే ఎంతో ఇష్టం. చాలా కాలం నుండి సుబ్రహ్మణ్యం నాణేలను దాచుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరపడంతో తనూ కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. తను దాచుకున్న నాణేలతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుదామని నిర్ణయించుకున్నాడు. ఇది 75వ స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి తన వద్ద ఉన్న నాణేల్లోని 75 వేల రూపాయల నాణేలతో భారత దేశ చిత్ర పటాన్ని రూపొందించారు. 

అదొక్కటే కాదు..

భారత దేశ చిత్ర‌ ప‌టం ఒక్క‌టే రూపొందిస్తే స‌రిపోదని అనుకున్నారు సుబ్ర‌హ్మణ్యం. అందుకే చిత్ర ‌ప‌టంతో పాటు 75 మంది స్వాతంత్య్ర స‌మ‌ర ‌యోధుల చిత్రాల‌ను కూడా ఏర్పాటు చేశారు. అందుకేనేమో ఈ వినూత్న చిత్ర ప‌టం భార‌త్ టాలెంట్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో న‌మూదైంది.

కోనసీమ జిల్లా ఎంతో ప్రత్యేకం

స్వతంత్ర పోరాటంలో కోనసీమ జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం నుండి స్వాతంత్ర్య మహా సంగ్రామంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 22 మంది పాల్గొన్నారు. ఒకే గ్రామం నుండి ఇంత ఎక్కువ మంది స్వాతంత్ర్య పోరాట యోధులు ఉండటం నిజంగా విశేషం. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన వారి త్యాగాలకు గుర్తుగా ఆ ఊరిలో ఓ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంబరాల్లో భాగంగా.. ఆ గ్రామ ప్రజలు స్వాతంత్ర్యోద్యమ అమర వీరులకు ఘనంగా నివాళి అర్పిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన యోధులను, అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటారు.

Published at : 16 Aug 2022 11:47 AM (IST) Tags: Independence Day 2022 Independence Day Celebrations Konaseema Special Independace Day Differently Celebrated Independence Day India Map With Coins

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Minister Venu Gopala Krishna : వైద్య విద్యార్థులకు వైఎస్ఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ ను కించపర్చలేదు- మంత్రి చెల్లుబోయిన

Minister Venu Gopala Krishna : వైద్య విద్యార్థులకు వైఎస్ఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ ను కించపర్చలేదు-  మంత్రి చెల్లుబోయిన

Kakinada Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు

Kakinada Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Bendapudi Govt School : బెండపూడి ఇంగ్లీష్ ఆస్ట్రేలియా వరకు, బోధనా విధానాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియన్ టీచర్

Bendapudi Govt School : బెండపూడి ఇంగ్లీష్ ఆస్ట్రేలియా వరకు, బోధనా విధానాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియన్ టీచర్

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!