Viral News: ఇది అట్టాంటి ఇట్టాంటి పెళ్లి కాదు, గోదారోళ్ల పెళ్లి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!
Viral News: పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒకేసారి జరిగే తంతును అందరూ అద్భుత జ్ఞాపకం, పది తరాలు చెప్పుకునేలా ఉండాలనుకుంటారు.
Viral News: పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒకేసారి జరిగే తంతును అందరూ అద్భుత జ్ఞాపకం, పది తరాలు చెప్పుకునేలా ఉండాలనుకుంటారు. అందుకోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రీతిలో ప్రత్యేకంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. అందులో పంజాబీ, మహారాష్ట్ర పెళ్లిల్లు రాజ వంశీయుల తరహాలో ఘనంగా జరుగుతాయి. కాలం మారేకొద్ది అందులోను కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు గుర్రాలు, సవారీ, ఊరేగింపు ఉండేవి. కాలక్రమేణా అందులోను మార్పులు వచ్చాయి. గుర్రాల బదులు బుల్లెట్లు వచ్చాయి. ఖరీదైన కార్లలో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.
మర్యాదల్లోనూ, ఆతిథ్యంలోను గోదారోళ్ల గురించి ఎవరికైనా చెబితే అబ్బో అనాల్సిందే. ఇక పెళ్లిళ్ల గురించి అయితే మరీ ప్రత్యేకం. పెళ్లి భోజనం దగ్గర నుంచి అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. వారి మర్యాదల గురించి చెబితే ఔరా అనాల్సిందే. pic.twitter.com/bkclCG2QL7
— news9 telugu (@news9telug2637) September 4, 2023
తెలుగు రాష్ట్రాల్లో సైతం పెళ్లిళ్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరులో జరుగుతాయి. తెలంగాణాలో పెళ్లి జరిగితే ముక్క ఉండాల్సిందే. మటన్, చికెన్ తప్పనిసరి. అవి లేని పెళ్లిళ్లు అంటే అక్కడ అవి పెళ్లిల్లే కాదు. అలాగే రాయలసీమలో మాత్రం పెళ్లిళ్లలో నాన్ వెజ్ ఉండదు. పక్కా రాయలసీమ స్టైళ్లో ఉంటుంది. గోదావరి జిల్లాల విషయానికి వస్తే వారి తీరే సపరేటు. గోదావరి జిల్లా ప్రజలంటేనే ఓ ప్రత్యేకం. మర్యాదల్లోనూ, ఆతిథ్యంలోను గోదారోళ్ల గురించి ఎవరికైనా చెబితే అబ్బో అనాల్సిందే. ఇక పెళ్లిళ్ల గురించి అయితే మరీ ప్రత్యేకం. పెళ్లి భోజనం దగ్గర నుంచి అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. వారి మర్యాదల గురించి చెబితే ఔరా అనాల్సిందే. ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.
ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ కొడుకు సుఖేష్ పెళ్లి రిసెప్షన్ కన్నుల పండవగా నిర్వహించారు. అంతకు మించి ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. pic.twitter.com/KkTwz9OaDu
— news9 telugu (@news9telug2637) September 4, 2023
దానికి ఉదాహరణగా నిలిచేలా అంబేద్కర్ జిల్లా రాజోలులో ఓ పెళ్లి జరిగింది. దానికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా ఇంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలతో పెండ్లి కొడుకు, పెళ్లికూతురు ఊరేగుతుంటే.. మహారాష్ట్ర తరహాలో అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి చేశారు.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ కొడుకు సుఖేష్ పెళ్లి రిసెప్షన్ కన్నుల పండవగా నిర్వహించారు. అంతకు మించి ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. సుఖేష్, శ్రీ రంగనాయకి వినూత్న ఊరేగింపు, బాణాసంచాలు, పంజాబీ మేళాలు, తాళాలు, పెళ్లి కొడుకు, కుమార్తె ఊరేగింపులు ఇలా ఒక్కటేమిటీ మాటల్లో చెప్పలేని వైవిధ్యంగా సాగింది.
అన్నిటికి మించి బుల్లెట్ బైకులపై మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసిన యువతులు రథంపై పెళ్లి కొడుకు ఊరేగింపులు పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కోనసీమ జిల్లాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం చూశాం కానీ.. వైవిధంగా చేసిన ఇలాంటి వివాహం ఈమధ్య కాలంలో చూడలేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.