Prakasam Crime: ఒంగోలులో దారుణం... పట్టపగలే యువకుడిపై కత్తితో దాడి... అక్రమ సంబంధమే కారణమా...?
ఒంగోలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రవిప్రియ మాల్ వద్ద ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. తన భార్యతో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాశీరావు అనే యువకుడిపై రబ్బానీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రకారం జిల్లా ఒంగోలు రవిప్రియ మాల్ వద్ద కాశీరావు అనే వ్యక్తిపై రబ్బానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. గొంతు, కడుపులో కత్తితో పోడవడంతో కాశీరావు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని రిమ్స్ హాస్పటల్ కు తరలించారు. యువకుడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న రబ్బానీకి... నూర్జహాన్ తో 8 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఆరు సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో టీ కొట్టు పెట్టుకోని జీవనం సాగిస్తున్నాడు రబ్బానీ. ఇతని టీ షాపులో కాశీరావు(22) అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రబ్బానీ భార్య నూర్జహాన్ కాశీరావుల మధ్య సన్నిహితం ఏర్పడింది. ఆరు నెలల క్రితం నూర్జాహాన్ తో కాశీరావు పరారయ్యాడు. నేడు ఒంగోలు రవిప్రియమాల్ దగ్గరలోని ఓ సిగరెట్ షాప్ వద్ద కాశీరావు ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వచ్చి రబ్బానీ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులో రెండు హత్యలు
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కలిగిరి మండలంలోని అమ్మటివారి పాలెంలో తల్లి, కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు. రబ్బానీ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు మీరాబీ కుమార్తె నూర్జహాన్ తో రబ్బానీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నూర్జహాన్ భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో రబ్బానీతో సంబంధం ఏర్పడింది. ఇద్దరు కావలిలో కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నూర్జహాన్ తన అమ్మ దగ్గరకు వచ్చేసింది. కలిగిరి మండలం అమ్మటివారిపాలెంలో తల్లి మీరాబీ, తమ్ముడు అలీఫ్ తో కలిసి ఉంటోంది. అయితే నూర్జహాన్ ని భార్యగా భావించి ఆమెతోనే ఉంటున్న రబ్బానీకి ఇది నచ్చలేదు. తనని కాదని తల్లి దగ్గరకు వెళ్లే సరికి నూర్జహాన్ పై కక్ష పెంచుకున్నాడు రబ్బానీ. ఆమెకు రక్షణ ఇచ్చిన ఆమె తల్లి, తమ్ముడిపై కూడా పగ పెంచుకున్నాడు.
Also Read: నెల్లూరు జిల్లాలో ఘాతుకం... సహజీవనంలో గొడవలు ఇద్దరి దారుణ హత్య
కావలి నుంచి అమ్మటివారిపాలెంకు వచ్చిన రబ్బానీ నేరుగా నూర్జహాన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె లేకపోయే సరికి ఆమె తల్లి, తమ్ముడితో గొడపడ్డాడు. నూర్జహాన్ ని తనతో పంపించేయాలని అన్నాడు. అయితే వారు దానికి ఒప్పుకోలేదు. నూర్జహాన్ పై ఒత్తిడి తేవద్దని కోరారు. తనతోపాటు కత్తిని కూడా తెచ్చుకున్న రబ్బానీ, కోపంలో మీరాబీని విచక్షణా రహితంగా నరికేశాడు. అడ్డం వచ్చిన ఆమె కొడుకు అలీఫ్ ని కూడా కత్తితో గాయపరిచాడు. దీంతో వారిద్దరూ రక్తపుమడుగులో పడి చనిపోయారు.
Also Read: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...