అన్వేషించండి

Keshineni Brothers Fight : ఘర్షణకు దారి తీసిన కేశినేని బ్రదర్స్ రాజకీయ విబేధాలు - తిరువూరులో ఉద్రిక్తత

TDP : కేశినేని బ్రదర్స్ రాజకీయంగా విడిపోవడంతో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫ్లెక్సీల్లో ఫోటో విషయంలో అన్నదమ్ముల అనుచరులు తిరువూరులో ఘర్షణకు దిగారు.


Politics of Telugu Desam : విజయవాడ ఎంపీ సీటు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అన్న సీటుకు తమ్ముడు పోటీ కావడంతో ఆయా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏ సమావేశం నిర్వహించినా రెండు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. తాజాగా  తిరువూరులో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ నెల 7న చంద్రబాబు (Chandrababu) తిరువూరులో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. దీంతో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 

ఈ ఫ్లెక్సీల్లో కేశినేని ( Kesineni Nani ) ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని ఫ్లెక్సీలను చించివేశారు. కేశినేని చిన్నినీ సమావేశానికి రానివ్వమంటూ గేటు వద్ద కేశినేని నాని వర్గం ఆందోళనకు దిగింది. తిరువూరు టీడీపీ ఇంచార్జి దత్తుపై నాని వర్గం దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇంఛార్జ్ దత్తుపై కూడా నాని వర్గం ఆందోళనకు దిగింది. కొద్దిసేపటికి వేలాదిమందితో కేశినేని చిన్ని ర్యాలీగా వచ్చారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ దశలో పార్టీ కార్యాలయంలోని రూంలో ఎంపీ కేశినేని నాని కూర్చున్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్ బయటకు రావాలని కార్యకర్తలు తలుపులు బాది నినాదాలు చేశారు.

 నాని వర్గీయులు ఫ్లెక్సీలు చించేయగా.. అందులో జనసేన అధినేత పవన్‌ ఫొటో ఉందంటూ జనసైనికులు నిరసనకు దిగారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ దశలో జోక్యం చేసుకున్న పోలీసులు, ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండటంతో.. ఏర్పాట్ల కోసం తిరువూరు నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా.. సమావేశానికి వెళ్లకముందే పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. తిరువూరులో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ పతాక స్థాయికి చేరింది. నాని, చిన్ని వర్గాల మధ్య కుర్చీలు విసురుకోడంతో ఎస్ఐ తలకు గాయమైంది. దీంతో ఎస్ఐను తీసుకుని పోలీసులు బయటకు వెళ్ళారు.

విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేనికి ఈసారి చంద్రబాబు అవకాశం ఇవ్వడంలేదని.. ఆయన తమ్ముడు చిన్నిని ఆ స్థానంలో పోటీ చేయించబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరి బ్రదర్స్ మధ్య రాజకీయ చిచ్చు చెలరేగింది. ఇది కాస్త వర్గ విభేదాలుగా మారాయి. అన్న కేశినేని పేరు చెబితే తమ్ముడు చిన్ని వర్గానికి నచ్చడం లేదు. తమ్ముడు చిన్ని పేరు వింటేనే అన్న నాని వర్గం మండిపోతోంది. దీంతో సమావేశాలు, కార్యక్రమాల్లో రెండు వర్గాలు పరస్పరం దూషించుకుంటున్నాయి. దాడులు చేసుకుంటున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Fake PM Kisan Yojana App: ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
JEE Main Correction Window: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల సవరణ ప్రారంభం, తప్పులుంటే సరిచేసుకోండి
జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల సవరణ ప్రారంభం, తప్పులుంటే సరిచేసుకోండి
Gautam Adani: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
Embed widget