అన్వేషించండి

Papikondalu: ఆదివారం నుంచే పాపికొండల్లో బోటు సర్వీసులు.. ఈ లింక్ క్లిక్ చేసి ప్యాకేజీలు చూడండి..

టూరిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదివారం(నవంబర్ 7) పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతోంది. పేరంటాలపల్లిలోనూ బోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఏపీలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. అయితే కొంతకాలంగా పాపికొండలు యాత్ర నిలిచిపోయింది. ఇప్పుడు గోదావరి నదిలో బోటు షికారు చేయాలనుకునే వారికి.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం నుంచి బోటింగ్ ప్రారంభం కానుంది.   టూరిజం, పోలీసులు అధికారులతో కలెక్టర్ హరి కిరణ్ సమావేశం నిర్వహించారు. బోటు ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు.

కలెక్టర్ హరికిరణ్ ఆదేశాలకు అనుగుణంగా.. శనివారం ట్రయల్ వేశారు. యాత్రకు పేరంటాలపల్లి స్థానిక లాంచీల రేవు నుండి బయలుదేరి వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి టెంపుల్ నుండి విహారయాత్ర ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలు పై విశ్వసనీయతను పెంపొందించే దిశగా డ్రై రన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెలిపారు. పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు.

బోట్లలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ఉండాలని పరిమితికి మించి బోట్లలో ఎక్కించుకోకుడదని..  జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ చెప్పారు.  బోట్లో వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు.  నిబంధనలు పాటించని బోటు యాజమనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోట్ల లైసెన్సులు.. రద్దు చేస్తామన్నారు. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం కానుంది. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

పాపికొండలు టూర్ కోసం పర్యాటక శాఖ పలు ప్యాకేజీలు అమలు చేస్తోంది. ఇందులో ఒకరోజు, రెండు రోజులకు ప్రత్యేకమైన ప్యాకేజీలు ఉంటాయి. ఆన్ లైన్లో www.papikondalu.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Also Read: Praja Sankalpa Yatra: ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు... నాడు నేడూ ప్రజల కోసమే నా ప్రయాణం.... సీఎం జగన్ ట్వీట్

Also Read: AP Power Politics : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?

Also Read: PapiKondalu: విషాదాన్ని దాటి ప్రారంభమైన పాపికొండల యాత్ర

Also Read: Hyderabad Crime: షోరూంలో షాకింగ్ ఘటన... డ్రెస్సింగ్ రూంలో దుస్తులు మార్చుకుంటున్న యువతి... వీడియో తీసిన యువకులు

Also Read: Anantapur Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కూలీలతో వెళ్తోన్న ఆటోను ఢీకొన్న లారీ... రెండు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget