అన్వేషించండి

Nellore Anil Warning : అమ్మలక్కలు తిట్టిస్తా - టీడీపీ నేతలకు మాజీ మంత్రి అనిల్ హెచ్చరిక !

టీడీపీ నేతలను అమ్మలక్కలు తిట్టించగలనని మంత్రి అనిల్ హెచ్చరించారు. యూట్యూబ్ చానల్స్‌లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయనంటున్నారు.

"గడప గడపకూ మన ప్రభుత్వం" కార్యక్రమంలో కొంత మంది తెలుగుదేశం పార్టీ ( TDP ) నేతలు, కార్యకర్తలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ ( Anil kumar ) యాదవ్ అసహనం ఫీలవుతున్నారు.  తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన  హెచ్చరికలు జారీ చేశారు. . టీడీపీ కార్యకర్తలు అక్కడక్కడా కావాలనే అడ్డు తగులుతున్నారని, అలాంటి సంఘటనలను  మీడియా కావాలనే హైలెట్ చేస్తోందని విమర్శించారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు తన ఫొటో,  కొడాలి నాని ( Kodali Nani ) ఫొటో పెట్టుకోనిదే వ్యూస్ రావని ఎద్దేవా చేశారు. 

కాలేజ్ హాస్టల్ గోడదూకి నలుగురు బాలికలు పరార్, ఎక్కడికెళ్లారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన నియోజకవర్గంలోని ఓ కాలనీకి వెళ్లారు. అక్కడ ప్రజలు ఆయనను చుట్టు ముట్టారు. సమస్యలపై నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేకపోవడంతో ఆయన కారులో ఎక్కి హడావుడిగా వెళ్లిపోయారు. ఈ వీడియోను అనేక యూట్యూబ్ చానళ్లు రిపోర్ట్ చేశాయి. రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేశాయి.  ఇవి ఆయన దృష్టికి వెళ్లడంతో  ఫీలయినట్లుగా కనిపిస్తోంది. అందుకే రెండు రోజులుగా ఆయన యూ ట్యూబ్ చానళ్లపై విరుచుకుపడుతున్నారు. అలాంటి వారంతా తెలుగుదేశం పార్టీ వారేనని ఆయన నమ్ముతున్నారు. 

రాజ్యసభ సభ్యత్వాల్లో నెల్లూరుకి లక్కీ ఛాన్స్

తమను అడ్డుకున్నట్లుగా.. తిడుతన్నట్లుగా టీడీపీ నేతల్ని కూడా తాము తిట్టించగమని ఆయన అంటున్నారు.  టీడీపీ నాయకులు కూడా జనాల్లోకి వస్తున్నారని, తాము కూడా వారిని అమ్మలక్కలు తిట్టించగలమని హెచ్చరించారు. అలా తిట్టించి  ప్రచారం చేయింగలమన్నారు.  తమను అడ్డుకోవడం.. విమర్శించడం మానుకోకబోతే అదే జరుగుతుందని హెచ్చరించారు. 

ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించండి, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు

అనిల్ కుమార్ , కొడాలి నాని మాజీ మంత్రులు. వీరిద్దరూ జగన్‌కు సన్నిహితులు.  అత్యంత విధేయత చూపిన వీరికి మంత్రి పదవి ఉంటుందనుకున్నారు. కానీ ఉండలేదు. మాజీలయ్యారు. అప్పట్నించి వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఓ వైపు పదవి పోయిన అసహనం.. మరో వైపు పార్టీ హైకమాండ్ కూడా ప్రాధాన్యత తగ్గించిన వైనం ఆయనను ఇబ్బందికి గురి చేస్తోంది. అందుకే ఆయన ఇలా పదే పదే కంట్రోల్ తప్పుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  ప్రజలు నిలదీస్తున్నారు తప్ప టీడీపీ నేతలు కాదంటున్నారు. అలా అయితే...  ప్రజంలతా టీడీపీనేనా అని ప్రశ్నిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Embed widget