JSP For AP Fisherman: నర్సాపురంలో జనసేన మత్స్యకార అభ్యున్నతి సభ, ర్యాలీగా సభకు బయలు దేరిన పవన్
నర్సాపురం మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పయనమయ్యారు. రాజమండ్రి చేరుకున్న ఆయన భారీ ర్యాలీగా నర్సాపురం బయలుదేరారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన పార్టీ(Janasena) మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహిస్తుంది. ఈ సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్... రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నర్సాపురం(Narsapuram) చేరుకుంటారు. ఈ సభ ముగిసిన అనంతరం పవన్ నర్సాపురం నుంచి రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం(Rajahmahendravam) చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొనేందుకు రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా తరిలివస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు, ఘన స్వాగతం పలుకుతున్న జనసేన శ్రేణులు, ప్రజలు.. డ్రోన్ విజువల్స్..
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2022
Grand welcome to Chief Sri @PawanKalyan Drone visuals..#JSPForAP_Fishermen pic.twitter.com/o1ml4l8IFO
మత్స్యకారుల అభ్యున్నతి పేరిట జనసేన చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి యాత్ర తుది దశకు చేరింది. గత పది రోజులుగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఈ యాత్రలో పాల్గొ్న్నారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా నర్సాపురంలో జనసేన పార్టీ భారీ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఈ సభ కోసం గత రెండు రోజుల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులు ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. నర్సాపురం, రుస్తుంబాధ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనసేన జెండాలతో కళకళలాడుతున్నాయి. సభా ప్రాంగణం వద్ద జనసేనాని భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్ జనసైనికుల ర్యాలీతో నర్సాపురం చేరుకోనున్నారు.
Also Read: కడపలో సీఎం జగన్ పర్యటన, డిప్యూటీ సీఎం కుమార్తెకు పెళ్లికి హాజరు - సాయంత్రం విశాఖకు
#JSPForAP_Fishermen https://t.co/wjv8H86xkt
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2022
నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభా ప్రాంగణం.
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2022
వేదిక: రుస్తుంబాద, నరసాపురం, ప.గో జిల్లా.#JSPForAP_Fishermen pic.twitter.com/wVeIwMSDNa