Jagan In Kadapa: కడపలో సీఎం జగన్ పర్యటన, డిప్యూటీ సీఎం కుమార్తెకు పెళ్లికి హాజరు - సాయంత్రం విశాఖకు
సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్ డేగా దగ్గర భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. తొలుత ఆయన పుష్పగిరి కంటి ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ పేరుతో కొత్తగా ఏర్పాుట చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని రిబ్బన్ కట్ చేసి సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీఎం జగన్.. నేరుగా కడప జయరాజ్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానశ్రయానికి జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి కడప బయల్దేరి వెళ్లారు.
ఈ రెండు కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం తిరిగి సీఎం జగన్ అమరావతికి పయనం అవుతారు. తాడేపల్లిలోని ఇంటికి చేరుకొని విశ్రాంతి అనంతరం మళ్లీ సాయంత్రం 4 గంటలకు విశాఖ పర్యటనకు బయలుదేరుతారు. సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్ డేగా దగ్గర భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. అక్కడ కార్యక్రమం ముగిశాక రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే విశాఖపట్నానికి రాష్ట్రపతి రానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో ఆంక్షలను కఠినం చేశారు.
ఇటీవల సీఎం జగన్ విశాఖ శారదా పీఠం సందర్శనకు వెళ్లినప్పుడు నగర వాసులు విపరీతంగా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. కాన్వాయ్ వస్తుందంటూ దాదాపు గంటల తరబడి పౌరుల వాహనాలను నిలిపివేశారు. అసలే ఎయిర్ పోర్టుకు వెళ్లే రోడ్డు కాబట్టి.. విమాన ప్రయాణికులు నానా యాతన పడ్డారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శారదాపీఠం పరిసరాల్లో షాపులన్నీ మూసివేయించడంపై స్థానిక వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వైన్ షాపులు తెరిచి ఉండడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తన విశాఖ పర్యటనలో జనం ఇబ్బందులు పడ్డారని మీడియాలో రావడంతో.. సీఎం సైతం సీరియస్ అయ్యారు. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదని గట్టిగానే మందలించారు.
కడప, రిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం చేసిన సీఎం వైయస్ జగన్.#CMYSJagan #Kadapa pic.twitter.com/1qdq4FHxaC
— YSRCP Digital Media (@YSRCPDMO) February 20, 2022
👉జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
— Kadapa Police (@Kadapa_Police) February 20, 2022
👉కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వర్యులకు ఘనంగా స్వాగతం పలికిన కర్నూలు రేంజ్ ఐ.జి కె.వెంకట్రామిరెడ్డి ఐ.పి.ఎస్ గారు,(1/2) pic.twitter.com/UxWgoTwC5j