Mahanadu Nara Lokesh: పార్టీ లేకుండా చేస్తామన్న వారు అడ్రస్ లేకుండా పోయారు - మహానాడు సభలో లోకేష్ పవర్‌ఫుల్ స్పీచ్
Kadapa: మహానాడు సభలో నారా లోకేష్ ప్రసంగించారు. చంద్రబాబును జైల్లో పెట్టిన నేతను ప్రజలు ప్యాలెస్‌కు అంకితం చేశారని అన్నారు.

Lokesh Speech: చంద్రబాబును జైల్లో పెట్టిన నేతను ప్రజలు ప్యాలెస్‌కు అంకితం చేశారని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. కడపలో మహానాడు ముగింపు బహిరంగసభలో ప్రసంగించారు. దేవుని కడప, ఒంటిమిట్ట, అమీన్‌పీర్ దర్గా ఉన్న పుణ్యభూమి కడప అన్నారు. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది. పార్టీ లేకుండా చేస్తామన్న వారు.. అడ్రస్ లేకుండా పోయారని గుర్తు చేశారు. తప్పు చేయకున్నా చంద్రబాబును జైలులో పెట్టారు ..సీబీఎన్ అంటే ప్రజలందరికీ ధైర్యమన్నరాు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన అజెండా.. గత ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చిందన్నారు.
కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. పక్క రాష్ట్రానికి పంపారని లోకేష్ విమర్శించారు. జే బ్రాండ్ మద్యం విషంతో సమానమని.. ప్రమాదకర మద్యంతో 30 వేల మందిని పొట్టనపెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వం మద్యం ద్వారా రూ.వేల కోట్లు లూటీ చేసిందని.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడిందని తెలిపారు. అందరూ జెండాలు.. అజెండాలు పక్కనపెట్టి పనిచేశారు.. ప్రజలు కూటమిని ఆశీర్వదిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నామని.. జూన్‌లోనే తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తున్నామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం త్వరలో అమలు చేస్తున్నాం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
యువత కలల వారధి, యువగళం రధసారధి యువనేత నారా లోకేష్ ♥️ 💛✊#MahanaduRoars #Mahanadu2025#TeluguDesamParty#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/urDrge32j4
— Nara Lokesh Updates (@LN_Updates1) May 29, 2025
16 వేలకు పైగా పోస్టులతో జూన్‌లో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నాం...ఉద్యోగుల సమస్యలను పద్ధతి ప్రకారం ప్రభుత్వం పరిష్కరిస్తుందని ప్రకటించారు. మిషన్ రాయలసీమ అమలుకు ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత అహంకారం ఇగో పక్కన పెట్టాలని పార్టీ నేతలకు లోకేష్ పిలుపునిచ్చారు. విడాకులు, మిస్‌ఫైర్‌లు, క్రాస్‌ఫైర్‌లు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కొనసాగింపు అవససరమని.. రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే ఇది అవసరమని స్పష్టం చేశారు. 2014లో కష్టపడి రాష్ట్రాన్ని నడిపించాం..కానీ 2019లో ఓ సైకో సీఎం అయ్యాడు. దీంతో రాష్ట్రం అనేక ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. గుజరాత్‌లో బీేజపీ ఏడు సార్లు గెలిచిందని గుర్తు చేశారు.
దేవుని గడప సాక్షిగా వైసీపీకి లోకేష్ పలు ప్రశ్నలు వేశారు. తల్లి ని చెల్లిని గెంటేసింది ఎవరు ? బాబాయ్‌ను లేపేసింది ఎవరు ? ఎర్రబటన్ నొక్కి ప్రజల బటన్ నొక్కింది ఎవరు ? నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసింది ఎవరు ? చెప్పాలన్నారు. ఎర్రబుక్ పరంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటానని అప్పుడే చెప్పాననని.. ఒకరికి గుండెపోటు వచ్చింది. ఇంకొకరు చేయి విరగ్గొట్టుకున్నారు. ఇంకో వ్యక్తికి ఏమైందో అంతా చూస్తున్నారు. అర్థమైందా రాజా అని సెటైరిక్ గా ఉన్నారు. జలకు అందబాటులో ఉండాలి. ఎప్పుడైనా నా ఇంటి తలుపు తెరిచే ఉంటాయని పార్టీ నేతలకు లోకేష్ భరోసా ఇచ్చారు.





















