News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nara Lokesh : మరోసారి మంగళగిరి కోర్టుకు నారా లోకేష్ - ఈ సారి పరువు నష్టం కేసులు ఎవరపైనంటే ?

తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేతలపై నారా లోకేష్ వరుసగా పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై ఆరోపణలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.

FOLLOW US: 
Share:


Nara Lokesh :  తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెలవప్‌మెంట్ స్కాంలో తన పాత్ర ఉందంటూ ఓ మీడియాలో వార్తలు రాసిన వారిపై ఆయన క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు.  సాక్షి పత్రికతో పాటు  అజయ్ రెడ్డి అనే వ్యక్తిపైనా  క్రిమినల్ కేసులు  పెట్టారు. శుక్రవారం లోకేష్ మంగళగిరి కోర్టు లో హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.   గురువారం మధ్యాహ్నం నుంచి పాదయాత్రకు విరామం ఇచ్చి మంగళగిరికి రానున్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లో భారీ స్కామ్  అని ఆ కార్పొరేషన్  చైర్మన్ అజయ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లోకేష్‌‌పై ఆరోపణలు చేశారు. తనకు సంబంధం లేని అంశంతో చేసిన ఆరోపణలతో అజయ్ రెడ్డికి లోకేష్ నోటీసులు పంపించారు. అయితే అజయ్ రెడ్డి వాటికి సమాధానం ఇవ్వలేదు. దానికి సమాధానం లేకపోవడంతో పరువుకు భంగం కలిగించిన అజయ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. అలాగే స్కిల్స్ స్కామ్ అంటూ సాక్షిలో వేసిన కథనంపై కూడా ఆ పత్రికకు లోకేష్ నోటీసులు పంపారు. పత్రిక ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో ఆ పత్రికపై కూడా మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేష్ మంగళగిరి కోర్టులో ఉదయం 11 గంటలకు హాజరు కానున్నారు.   
 
ఇంతకు ముందు  కూడా  వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ  చీఫ్‌ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు  లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు.  ఈ ఆత్మహ‌త్యపై వైసీపీ సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి లోకేష్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా  ప్రచారం చేశారు.  ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది.   తన ఆరోపణలు ఫేక్ అని తెలిసినా  గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారు.  త‌ప్పుడు రాత‌లపై గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డికి త‌న లాయ‌ర్ దొద్దాల కోటేశ్వర‌రావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ  ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ గా ప‌నిచేస్తుండ‌డంతో ఆయా కార్యాల‌యాల‌కు నోటీసులు పంపితే తీసుకోలేదు.  చివ‌రికి గుర్రంపాటికి వాట్స‌ప్ ద్వారా నోటీసులు పంపారు. 
 
సెప్టెంబ‌రు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత  నారా చంద్రబాబుని సారా  చంద్రబాబు నాయుడు అని పిలవాలని పిలుపునిచ్చారు.  హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారు.  భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారని,  లోకేష్‌కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదంటూ.. చంద్రబాబు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని సునీత‌ ఆరోపింారు.  
 
వ్యక్తిగ‌త‌, రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసం త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా పోతుల సునీత చేసిన దారుణ‌మైన త‌ప్పుడు వ్యాఖ్యలపై నారా లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖ‌లు చేశారు. గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై దాఖ‌లు చేసిన కేసుల్లో ఐపిసి సెక్షన్ 499, 500 ప్రకారం క‌ఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసులో పిటిష‌న‌ర్ అయిన నారా లోకేష్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదు  చేశారు. ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చేసిన ఆరోపమలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Published at : 03 Aug 2023 04:57 PM (IST) Tags: Nara Lokesh Mangalagiri Nara Lokesh skill development case

ఇవి కూడా చూడండి

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

Nara Lokesh: నారా లోకేష్ కీలక నిర్ణయం, రేపు ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష

Nara Lokesh: నారా లోకేష్ కీలక నిర్ణయం, రేపు ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

టాప్ స్టోరీస్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

Hyper Aadi: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్

Hyper Aadi: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్

LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు

LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు