అన్వేషించండి

Kova Bun Controversy: కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి నారా లోకేష్ మద్దతు.. త్వరలోనే కలుస్తానని భరోసా

Nara Lokesh backs Kova Bun Vendor | కర్నూలు కోవా బన్ వ్యాపారి వలీకి ఏపీ మంత్రి నారా లోకేష్ మద్దతు తెలిపారు. త్వరలోనే వలీని కలుస్తానని, కోవా బన్ రుచి చూస్తానని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అమరావతి: కర్నూలుకు చెందిన కోవా బన్ చిరు వ్యాపారి వలీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన మద్దతును ప్రకటించారు. త్వరలోనే వలీని స్వయంగా కలుస్తానని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వలీ తయారుచేసే కోవా బన్ రుచి చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. అయితే ఇటీవల ఆయనపై కొందరు చేసిన ఆరోపణలు తనను కలచివేశాయంటూ లోకేష్ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.

చిరు వ్యాపారులకు అండగా కూటమి ప్రభుత్వం
సమాజంలో ఐక్యతను దెబ్బతీసే ఇటువంటి ప్రవర్తనలకు తావులేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వలీ వంటి చిన్న వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు వలీని కలిసి ఆయనకు ధైర్యం చెప్పడమే కాకుండా, ఆయన వ్యాపారానికి పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ పేర్కొన్నారు.


Kova Bun Controversy: కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి నారా లోకేష్ మద్దతు.. త్వరలోనే కలుస్తానని భరోసా

అసలేంటీ కోవా బన్ వివాదం..
కర్నూలులో వలీ అనే వ్యక్తి రోడ్డు పక్కన బండిపై 'కోవా బన్' అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. అయితే, ఇటీవల మేడారం జాతరలో కోవా బన్ విక్రయించాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకుని, ఆయన వద్ద కోవా బన్ కొనవద్దంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగారు. కొందరు వ్యక్తులు ఆ కోవ్ బన్ నువ్వు తింటావా, తిని చూపించు అని సైతం అడిగారు. చిరువ్యాపారి వలీ ఆ కోవా బన్ అందరి సమక్షంలో తిని కూడా చూపించాడు. అంత తక్కువ ధరకు కోవా బన్ అంటే అందులో కల్తీ జరిగిందని, ఎవరూ తినవద్దని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

కేవలం విద్వేషం వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఒక చిన్న వ్యాపారి పొట్ట కొట్టేలా కొందరు వ్యవహరించడం స్థానికంగా, రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు వలీకి మద్దతు తెలిపి, నాణ్యత బాగుంటే అతడి వద్దే కొని తింటామని సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ విద్వేషపూరిత ప్రచారాన్ని ఖండిస్తూనే మంత్రి నారా లోకేష్ వలీకి మద్దతుగా నిలిచారు. త్వరలోనే అతడ్ని కలిసి వలీ చేసిన కోవా బన్ రుచి చూస్తా అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget