News
News
X

MLA Roja: ఏపీలో దొంగే దొంగా... దొంగా అన్నట్లు టీడీపీ నేతలు.. స్మగ్లింగ్‌‌తో ఏం సందేశం ఇస్తున్నారు..? ఎమ్మెల్యే రోజా ఫైర్

విశాఖపట్నంలో 28 కేజీల గంజాయితో పట్టుబడటంతో చిత్తూరు జిల్లా నగరి టీడీపీ అభ్యర్థి భాను ప్రియ శిష్యుడు హరికృష్ణ గంజాయి కేసులో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

FOLLOW US: 

TDP leader caught with cannabis in Vizag: గత కొంతకాలం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అంశం డ్రగ్స్, గంజాయి సరఫరా, వినియోగం. ముఖ్యంగా ఏపీలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో సరఫరా, డ్రగ్స్ వినియోగంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరి తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థి భాను ప్రియ శిష్యుడు హరికృష్ణ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడు. విశాఖపట్నంలో 28 కేజీల గంజాయితో పట్టుబడటంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

టీడీపీ నేతలకు సంబంధించిన వ్యక్తి గంజాయి కేసులో అరెస్ట్ కావడంపై నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఏపీలో దొంగే దొంగా... దొంగా అన్నట్లు టీడీపీ పార్టీ పరిస్థితి తయారైందన్నారు. ఇప్పటివరకూ డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై బురదజల్లే కార్యక్రమం మినహా, తప్పు చేసినట్లు ఎక్కడా రుజువు చేయలేకపోయారని చెప్పారు. ప్రజలకు విఘాతం కలిగించే వ్యక్తులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, నగరి టీడీపీ అభ్యర్థి చేరదీస్తున్నారని రోజా విమర్శించారు. టీడీపీ నాయకులు రౌడీలను గుండాలను పెంచి పోషిస్తున్నారని, దొంగ పనులు చేసే అలవాటు టీడీపీకి పరిపాటిగా మారిందంటూ ఎద్దేవా చేశారు. 

ఏం సందేశం ఇస్తున్నారు..?
నేర చరిత్ర కలిగిన వ్యక్తి టీడీపీ యూత్ ప్రెసిడెంట్ గా ఉంటూ యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. గంజాయి అక్రమ తరలింపులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందనే అంశం బయటకు రావాల్సి ఉంది. హరికృష్ణను వెనుకనుండి నడిపిస్తున్న వారిని పోలీసులు బయటకు తీసుకురావాలి. మరోవైపు యువతను లక్ష్యంగా చేసుకుని కాలేజీలు, వాటి పరిసర ప్రాంతాలలో సైతం మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు వాటిని పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నగరి టీడీపీ అభ్యర్థి భాను ప్రియ శిష్యుడు హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రోజా అన్నారు.  

Koo App
నగరి టీడీపీ అభ్యర్థి భాను ప్రియ శిష్యుడు హరికృష్ణ విశాఖపట్నంలో 28 కేజీల గంజాయితో అరెస్ట్ అయ్యారు. ఏపీలో దొంగే దొంగా... దొంగా అన్నట్లు టీడీపీ పార్టీ పరిస్థితి తయారైందని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై బురదజల్లే కార్యక్రమం మినహా, తప్పు చేసినట్లు ఎక్కడా రుజువు చేయలేకపోయారన్నారు. #Roja #Nagari #Cannabis #APNEWS #RKRoja https://telugu.abplive.com/andhra-pradesh/mla-roja-question-tdp-leaders-about-trafficking-marijuana-in-vizag-17966 - Shankar (@guest_QJG52) 12 Jan 2022

డ్రగ్స్ అడ్డాగా ఫిట్‌నెస్ సెంటర్..
పీఎస్ ఫిట్‌నెస్ సెంటర్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిన వ్యక్తి హరికృష్ణ. పిల్లలు మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లితండ్రులతో పాటు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కొందరు వ్యక్తులు యువత, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ సప్లైకి నిందితుడు హరికృష్ణ అడ్డాగా మార్చుకున్న సిమెంట్ షాపు, జిమ్ సెంటర్, ఇటుక దుకాణాలు సాధ్యమైనంత త్వరగా సీజ్ చేసి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. 

Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి! 

Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం

Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Jan 2022 09:08 AM (IST) Tags: tdp Chittoor Nagari MLA Roja Nagari RK roja cannabis MLA RK Roja Cannabis in Vizag Bhanu Priya Harikrishna AP News Nagari News

సంబంధిత కథనాలు

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు 

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు 

బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉంటుంది : మంత్రి బొత్స

బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉంటుంది : మంత్రి బొత్స

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

YSRCP MLA: మాకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తాం - వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

YSRCP MLA: మాకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తాం - వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

US President Joe Biden: వాళ్లకు సారీ చెప్పిన అమెరికా ప్రెసిడెంట్, ఎవరూ జైల్లో ఉండకూడదని ఆదేశాలు

US President Joe Biden: వాళ్లకు సారీ చెప్పిన అమెరికా ప్రెసిడెంట్, ఎవరూ జైల్లో ఉండకూడదని ఆదేశాలు

IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు వచ్చేస్తోంది, పరీక్ష తేదీలివే?

IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు వచ్చేస్తోంది, పరీక్ష తేదీలివే?