Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
జనవరి 12 బుధవారం రాశిఫలాలు
మేషం
మీరు ఏమనుకున్నా పూర్తైపోతాయి. స్థిరాస్తుల క్రయ, విక్రయాల వల్ల లాభం ఉంటుంది. మీరు కొత్త పనిలో పెట్టుబడి పెట్టొచ్చు. ఆకట్టుకునేలా మాట్లాడేందుకు ప్రయత్నించండి. యువత తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. ప్రభుత్వ పనులు ముందుకుసాగుతాయి.
వృషభం
మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలి. మీ విశ్వాసం కాస్త సన్నిగిల్లొచ్చు. ఆహారం విషయంలో అజాగ్రత్త వల్ల ఆరోగ్యం పాడవుతుంది. శత్రువులు మీకు హాని చేయాలని భావిస్తారు. కళ్లకు సంబంధించిన కొంత ఇబ్బంది ఉండొచ్చు. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు.
మిథునం
ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పొందే అవకాశాలున్నాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రజలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది. పూర్వీకుల వ్యాపారాల వల్ల లాభం ఉంటుంది. ఈరోజు విహారయాత్రకు వెళ్లే ప్లాన్ చేసుకుంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
కర్కాటకం
ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. పెద్ద బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. విలువైన వస్తువుల భద్రతపై మీరు శ్రద్ధ వహించాలి. స్నేహితులని కలుస్తారు. షేర్ మార్కెట్‌లో ముందస్తు పెట్టుబడి నుంచి లాభం పొందుతారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మీ మాటల మీద సంయమనం పాటించండి.
సింహం
మీకు తెలియని అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి విజయం వరిస్తుంది. మీరు చదువు పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వైవాహిక సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. రుణం మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది.
కన్య
ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. రోజంతా బిజీగా ఉంటారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారులు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. ఈరోజు మీరు ఏ పనిలోనూ పెద్దగా అనుభూతి చెందలేరు.
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
తుల
ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సోమరితనం విడిచిపెట్టండి. ప్రేమికులకు ఈరోజు చాలా మంచిరోజు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ మేధో సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. దినచర్యలో మార్పు ఉంటుంది.
వృశ్చికం
మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. గొప్ప బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. కొన్ని కారణాల వల్ల కుటుంబంలో కలహాలు రావొచ్చు. లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో డబ్బు సంపాదిస్తారు. ప్రభుత్వ పనులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
ధనుస్సు
ఈరోజు సాధారణ రోజు అవుతుంది. పెద్దల అనుభవాల వల్ల ప్రయోజనం పొందుతారు. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. మతపరమైన ప్రదేశానికి వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు. మీ పిల్లల విజయాలతో సంతోషంగా ఉంటారు.ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
మకరం
తెలియని భయంతో బాధపడతారు. మీకు ఏ పని చేయాలని అనిపించదు. మైగ్రేన్ రోగులకు రోజు మంచిది కాదు. ఒకరి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇతరుల ప్రతికూల విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
కుంభం
ఈ రోజంతా బిజీగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనుల్లో చిక్కుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు. వ్యాపారంలో స్నేహితుల సహాయం తీసుకోవచ్చు.
మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. కొంతమంది మీ పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవచ్చు. సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి