అన్వేషించండి

2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!

Shravana Shukravaram: ఆగష్టు 13 గురువారం నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఆగష్టు 14 మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈరోజు లక్ష్మీదేవికి పూజ ఇలా సులువుగా చేసేసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి పూజకు అత్యంత విశిష్టమైన, అనుకూలమైన రోజు.
  • సూర్యోదయాన స్నానం చేసి, ఇంటిని అలంకరించి పూజకు సన్నాహాలు చేయాలి.
  • కలశ స్థాపన, నైవేద్యాలతో భక్తిగా లక్ష్మీ పూజ నిర్వహించాలి.
  • హృదయ శుద్ధి, నిష్కామ భక్తితో ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం పొందాలి.

శ్రావణమాసం ఆధ్యాత్మికతకు, భక్తికి అత్యంత ప్రత్యేకం. సాధారణంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు..ఈ నెలలో వచ్చే శుక్రవారం మరింత విశిష్టమైనవిగా భావిస్తారు భక్తులు. మొదటి శ్రావణ శుక్రవారం ఇంటికి సిరిసంపదలు, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం తీసుకొచ్చేందుకు అనుకూలమైన రోజు. వరలక్ష్మీవ్రతం పూర్తిస్థాయిలో చేయలేనివారు ఈ రోజు కూడా సాధారణ లక్ష్మీపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించవచ్చు. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే బాహ్య పూజతో పాటూ మనస్సు శుద్ధి, భక్తి, కృతజ్ఞత భావం ముఖ్యం. శ్రీ మహాలక్ష్మి ధనాన్ని మాత్రమే కాదు..ధైర్యం, శాంతి, కుటుంబ ఐక్యతను కూడా ప్రసాదిస్తుంది. పూజకోసం ముందుగా సన్నాహాలు చేసుకోండి. 

సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించండి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేయండి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించండి. ఇది శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించేందుకు సంకేతం. 

శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!

పూజా సామగ్రి సిద్ధం చేసుకోండి

దీపం కుందులు, వత్తులు, నూనె, పసుపు, కుంకుమ, గంధం, అగరుబత్తి, కర్పూరం, ఆవు నెయ్యి, అక్షింతలు, తాజా పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కలు, కలశం, కొత్త వస్త్రం, నాణేలు, పాయసం, చక్కెర పొంగలి లేదా పరమాన్నం వంటి నైవేద్యాలు సిద్ధం చేసుకోండి. 

పూజా విధానం ఇలా సులువుగా...

ముందుగా పూజా స్థలంలో పీఠం ఏర్పాటు చేసి దానిపై లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచండి. కలశ స్థాపన చేయండి. కలశంలో శుభ్రమైన నీరు, పసుపు , కుంకుమ, బియ్యం , నాణేలు వేసి మామిడి ఆకులు, పసుపు రాసిన కొబ్బరికాయ ఉంచండి. దానిపై వస్త్రాన్ని అలంకరించండి. ముందుగా వినాయక ప్రార్థన చేసి...అనంతరం అమ్మవారిని ఆవాహనం చేయండి. పసుపు, కుంకుమ, గంధం, పూలతో అలంకరించి షోడసోపచార పూజ లేదా పంచోపచార పూజ చేయండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి జపించండి..అనంతరం నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి.  

పూజ తర్వాత ముత్తైదువులకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం , వస్త్రాలు వాయనంగా ఇవ్వండి. ఉపవాసం పాటించేవారు నైవేద్యం స్వీకరించిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు. 

ఏ పూజలో అయినా బాహ్య ఆచారాలు కాదు..హృదయ శుద్ధి, నిష్కామ భక్తి ముఖ్యం. శ్రీ మహాలక్ష్మి పూజలో భాగంగా సంపదతో పాటూ సద్గుణాలు, సహనం, దయ కలగాలని కోరుకోండి. 

శ్రావణ శుక్రవారం పూజ ద్వారా ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. వైవాహిక జీవితంలో కష్టాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు, భక్తుల విశ్వాసం కూడా. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి పూజ చేయండి..అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ప్రార్థించండి.  

మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!

ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

శ్రావణమాసం శుక్రవారాల ప్రాముఖ్యత ఏమిటి?

శ్రావణమాసం ఆధ్యాత్మికతకు, భక్తికి అత్యంత ప్రత్యేకం. ఈ నెలలో వచ్చే శుక్రవారాలను మరింత విశిష్టమైనవిగా భావిస్తారు భక్తులు, శ్రీ మహాలక్ష్మి పూజకు ఇది అనుకూలం.

వరలక్ష్మీ వ్రతం చేయలేనివారు శ్రావణ శుక్రవారం ఏమి చేయవచ్చు?

వరలక్ష్మీ వ్రతం పూర్తిస్థాయిలో చేయలేనివారు మొదటి శ్రావణ శుక్రవారం సాధారణ లక్ష్మీపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించవచ్చు. ఇది సిరిసంపదలు, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం తీసుకొస్తుంది.

శ్రీ మహాలక్ష్మి దేవి ఏమి ప్రసాదిస్తుంది?

శ్రీ మహాలక్ష్మి ధనాన్ని మాత్రమే కాకుండా ధైర్యం, శాంతి, కుటుంబ ఐక్యతను కూడా ప్రసాదిస్తుంది. పూజలో సంపదతో పాటు సద్గుణాలు, సహనం, దయ కలగాలని కోరుకోవాలి.

శ్రావణ శుక్రవారం పూజ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

శ్రావణ శుక్రవారం పూజ ద్వారా ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. వైవాహిక జీవితంలో కష్టాలు తొలగిపోతాయని, కుటుంబ సౌఖ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు : సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు : సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీ రాశికి ఎలా ఉండబోతోంది?
నవంబర్ 22, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీ రాశికి ఎలా ఉండబోతోంది?
కుంభ, మీన రాశుల వారఫలాలు నవంబర్ 22-28: ఈ వారం మీ జాతకం ఏం చెబుతోంది?
కుంభ, మీన రాశుల వారఫలాలు నవంబర్ 22-28: ఈ వారం మీ జాతకం ఏం చెబుతోంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget