అన్వేషించండి

MLA Gorantla Unhappy : ఎమ్మెల్యే గోరంట్ల అసంతృప్తి.. టీడీపీకి రాజీనామా చేసే యోచన..!

రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. 25న పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లుగా అనుచరులకు సమాచారం పంపారు.


తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి , ఎమ్మెల్యే పదవికి వారం రోజుల్లో నిర్ణయించుకున్నట్లుగా ఆయన తన అనుచరులకు సమాచారం ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కలకలం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కొద్ది రోజులుగా తనను దూరం పెడుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కనీసం తాను చేసే ఫోన్లను కూడా రిసీవ్ చేసుకోవడం లేదని ఇంత నిరాదరణకు గురి చేస్తున్న పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రేపోమాపో అనుచరులతో సమావేశాలు నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత. పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. ఇటీవలి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని మామ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలో మరో కీలక నేతగా ఉన్నారు. ఆయన వర్గంతో గోరంట్లకు సరిపడటం లేదని ప్రచారం ఉంది. ఈ కారణంగా ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన వారసుడ్ని కూడా ప్రకటించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ కారణంగా తన దివంగత సోదరుడు శాంతారామ్ కుమారుడు, రవిరామ్ కిరణ్ ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. తన నియోజకవర్గంలో ఆదిరెడ్డి కుటుంబీకులు జోక్యం చేసుకుంటున్నారనే ఇలా ప్రకటించారని ఆయన వర్గీయులు అనుకుంటున్నారు.

అయితే ఇటీవలి కాలంలో  పార్టీ నేతల మధ్య ఈ వర్గ విబేధాలు మరింత ముదిరాయని వాటిని సర్దుబాటు చేయడానికి హైకమాండ్ ఆసక్తి చూపించలేదని గోరంట్ల అసంతృప్తికి గురయ్యారు. తన వర్గీయుల్ని ఆదిరెడ్డి అప్పారావు వర్గం ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. చివరికి తనను కలవడానికి కూడా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను చెప్పడానికి తను పదే పదే ఫోన్ చేసిన స్పందించలేదన్న అసంతృప్తితో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి గోరంట్లకు ఫోన్ చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో మాట్లాడారని .. అన్ని విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయరని.. అంతర్గత రాజకీయాల వల్లే అసంతృప్తికి గురయ్యారని పార్టీ అధినేత వాటిని సర్దుబాటు చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

ఈ అంశంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిరాకరించారు. ఇప్పుడేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget