By: ABP Desam | Updated at : 21 Sep 2023 05:02 PM (IST)
Edited By: jyothi
మంత్రి రోజా (ఫైల్ ఫోటో) ( Image Source : Roja Facebook )
Minister RK Roja: శాసనసభ సమావేశాలను ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగ్ అనుకుంటున్నట్లు ఉన్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. అందుకే మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క రోజు ప్రజల సమస్యలపై స్పందించని బాలకృష్ణ.. బావ కళ్లల్లో ఆనందం కోసం అసెంబ్లీకి వచ్చారని అన్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో నిందితుడైన బాబు కోసం అసెంబ్లీలో మాట్లాడడం చూస్తుంటే.. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తోందని ఫైర్ అయ్యారు. నిజంగా ఎన్టీఆర్ పై చెప్పులు వేసినప్పుడు తన బావ చంద్రబాబుపై బాలకృష్ణ మీసం తిప్పి, తొడలు కొట్టి ఉంటే ప్రజలు హర్షించే వారని రోజా అన్నారు. అలాగే బావ కోసం అసెంబ్లీలో రౌడీయిజం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఫ్లూటు జింకం ముందు ఊదు.. సింహంలాంటి జగన్ ముందు కాదని రోజా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని భావిస్తే.. పద్ధతి ప్రకారం అసెంబ్లీ చర్చకోసం అడగాలి కానీ... స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభను అగౌరవ పరిచేలా ప్రవర్తించడం సరికాదని ఎమ్మెల్యే రోజా అన్నారు. తమ పార్టీ సభ్యులకు చట్టాలు, అసెంబ్లీ స్పీకర్ అంటే గౌరవం ఉంది కాబట్టే మౌనంగా ఉన్నామని చెప్పారు.
టీడీపీ నేతల తీరుపై స్పీకర్ ఫైర్
టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. ముఖ్యంగా బాలకృష్ణ ప్రవర్తన అభ్యంతరంగా ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఆయన మీసాలు మెలేయడంతోపాటు తొడలు కొట్టారని అన్నారు. అయితే ఇవన్నీ ఆయన మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వాయిదా తర్వాత శాసనస సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. సభ ప్రారంభమైన టైంలో టీడీపీ ఎమ్మెల్యేబాలకృష్ణ చేసిన చర్యలు అభ్యంతరకంగా ఉన్నాయని అన్నారు స్పీకర్. ఆయన మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం మంచి సంప్రదాయం కాదని అభిప్రాయ పడ్డారు. ఆయన చేసిన చర్యలు తప్పే అయినా మొదటి తప్పుగా భావించి క్షమించి వదిలేస్తున్నట్టు తెలిపారు.
అదే టైంలో ఆందోళన సమయంలో అసెంబ్లీ సొత్తును ధ్వంసం చేసిన సభ్యులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను సమావేశాలు పూర్తి అయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ధ్వంసమైన వస్తువుల డబ్బులను వారి నుంచే రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవడంపై టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో సభా వ్యవహారాల మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి లేచి... టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. మిగతా వారి ప్రవర్తన సరిగా లేదని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించారు. వెంటనే స్పీకర్ కలుగుజేసుకొని పయ్యావుల కేశవ్‌ను కూడా సమావేశాలు పూర్తి అయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
American Telugu Association: తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో 20 రోజులు సేవా కార్యక్రమాలు
Top Headlines Today: టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందన్న బుద్ధా వెంకన్న! ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Buddha Venkanna: 'విజయవాడ పశ్చిమ నుంచే పోటీ చేస్తా' - టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి
/body>