News
News
X

Peddi Reddy : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!

కుప్పం ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఆయన కుప్పం ఎన్నికలకు ఇంచార్జ్‌గా వ్యవహరించారు.

FOLLOW US: 
Share:

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. సర్పంచ్, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని అక్కడి ప్రజలు తిరస్కరించారన్నారు. ఈ ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలిగితే సంతోషిస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుకు 72 సంవత్సరాల వయసు వచ్చిందని..  ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికి రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటే.. తమను కానీ .. తమ సీఎం జగన్‌ను కానీ వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

Koo App
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జిల్లా పార్టీ నేతలను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. #YSRCPSweepsMunicipolls #YSJaganMarkInKuppam #CMYSJagan #YSRCP - YSR Congress Party - YSRCP (@YSRCPOfficial) 17 Nov 2021

Also Read : గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు !

కుప్పంలో ఓడిపోయినా టీడీపీ నేతలు దొంగ ఓట్లని.. మరోకటని ప్రచారం చేస్తారని కానీ వారే కోర్టుకు వెళ్లి అన్ని ఆదేశాలు తెచ్చుకున్నారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. పోలింగ్ రోజున ఏం జరిగిందో తనకు తెలియదని.. తాను అక్కడ లేనన్నారు. దొంగ ఓట్లు వేశారని ఎక్కడా ఫిర్యాదులు రాలేదని ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని పెద్దిరెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. 

Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కష్టపడి సీఎం అయి.. ఆయన కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని కానీ లోకేష్ ఎమ్మెల్యేగానే గెలవలేకపోయారన్నారు. ఇక నుంచి మా గురించి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ టీడీపీ నేతలు కానీ చెడు మాటలు మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.  చంద్రబాబు నాయుడు పుంగనూరుకు వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఏదేదో చెబుతామని గెలిచిన వారే నాయకులని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!

కుప్పం నియోజకవర్గానికి ఎన్నికల బాధ్యతను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. ఎన్నికల ఇంచార్జ్‌గా పెద్దిరెడ్డి కుప్పంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పార్టీ శ్రేణులందర్నీ కూడగట్టి విజయం సాధించారు.  చంద్రబాబు సుదీర్ఘంగా గెలుస్తున్న నియోజకవర్గంలో టీడీపీకి చెక్ పెట్టారు. 

Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Nov 2021 01:46 PM (IST) Tags: ANDHRA PRADESH Chandrababu Kuppam Minister Peddireddy Kuppam Municipal Results

సంబంధిత కథనాలు

Vatti Vasant Kumar Death: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత

Vatti Vasant Kumar Death: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత

AP BJP Vs TDP : టీడీపీతో పొత్తుండదని పదే పదే ఏపీ బీజేపీ నేతల ప్రకటనలు - అత్యుత్సాహమా ? రాజకీయమా ?

AP BJP Vs TDP : టీడీపీతో పొత్తుండదని పదే పదే ఏపీ బీజేపీ నేతల ప్రకటనలు - అత్యుత్సాహమా ?  రాజకీయమా ?

Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !

Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

టాప్ స్టోరీస్

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు

Waltair Veerayya Success Event :  వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు