By: ABP Desam | Updated at : 16 Nov 2021 11:06 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం(ప్రతీకాత్మక చిత్రం)
తన కుమార్తె వివాహానికి ఉద్యోగుల నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అంతా విధిగా కట్నకానుకలు పంపించాలని ఓ ప్రజాప్రతినిధి హుకూం జారీ చేశారని ఆదే పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం కోనసీమలో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. ఇటీవలే ఓ ప్రజాప్రతినిధి కుమార్తె వివాహం అయ్యింది. ఆ వేడుకకు అంతా రావాలని, అదే విధంగా వాలంటీరు నుంచి వీఆర్వో వరకు నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఇంత సమర్పించాలని నిర్దేశించి లిస్ట్ తయారు చేసి కొంత మంది ద్వారా పంపించారని ఆ వీడియోలో ఆరోపించారు.
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం
సొంత పార్టీ నేత తీవ్ర ఆరోపణలు
ఇక రిసెప్షన్‌లో ఒక మండలానికి ఒక టేబుల్ చొప్పున కౌంటర్లు పెట్టి ఏ మండలానికి ఎవరెవరు కట్నం రాశారని ఓ నాయకుడు పర్యవేక్షించాడని సదరు నేత వీడియోలో ఆరోపించారు. కార్యకర్తలు కష్టపడి ఎంతో వ్యయప్రయాసలతో నాయకున్ని గెలిపించుకుంటారని, తీరా గెలిపించుకున్న తరువాత ఆ కార్యకర్తకు గానీ, ప్రజలకు న్యాయం చేయకపోగా ఈ తరహా పద్ధతులు తమ నియోజకవర్గంలో జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా చేసుకున్నవాడికి చేసుకున్నంత చందంగా ఆ నాయకునికి సపోర్ట్‌గా ఉంటున్నవారు ఇసుక, మట్టి ఇలా అనేక విధాలుగా దోచుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. వీరికి పార్టీ కానీ, పార్టీ అధినేత కానీ ఏమైపోయినా పర్వాలేదని విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది. సొంత పార్టీకు చెందిన ఓ నాయకుడే ఇలా తీవ్ర ఆరోపణలు చేయడం, పైగా వీడియో విడుదల చేయడంపై కోనసీమ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్సార్ ఆసరా పథక చెక్కుల పంపిణీ సభల్లో వాలంటీర్లు, విద్యార్థులతో ఆ నేత పాదాలకు పూలు వేయించుకుని పాదపూజ చేయించుకున్నారని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
Also Read: భక్తులకు టీటీడీ అలర్ట్.. రెండు రోజులపాటు నడక దారి మూసివేత
Also Read: Minister Kannababu: మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయి.. త్వరలో చూస్తారు
Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?
KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Weather Latest Update: నేడు బంగాళాఖాతంలో తుపాను, అతి భారీ వర్ష సూచన: ఐఎండీ
GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
/body>