Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్.. రెండు రోజులపాటు నడక దారి మూసివేత
తిరుమలలో భారీ వర్షాల కారణంగా.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడకదారులు మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల నడక దారిని అధికారులు మరోసారి మూసేయనున్నారు. ఈ సారి ముందే జాగ్రత్త పడిన అధికారులు.. 2 రోజుల పాటు నడక దారి మూసేస్తున్నట్టు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో.. మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు రావడంపై అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. బుధవారం నుంచి.. రెండు రోజుల పాటు.. తిరుపతి నుంచి తిరుమలకు నడకదారి మూసివేస్తారు. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకుంది టీటీడీ. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు ప్రయాణమే సురక్షితమని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. నడక దారిలో అయితే.. వరద భారీగా పారింది. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, భక్తులు.. నడక దారి మెట్లకు ఉండే గోడలను పట్టుకుని భయంభయంగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా నడక దారిని తాత్కాలికంగా మూసేసిన టీటీడీ.. ఇప్పుడు ముందే అప్రమత్తమైంది.
ఇప్పటికే ఏపీలో కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల తిరుపతిలోనూ కుండపోతగా వర్షం కురుస్తోంది. తిరుమల కొండపై వర్షం కురుస్తూనే ఉంది. అసలే చలికాలం కావడంతో, వర్షం పడుతున్న కారణంగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి, కొండ పైనుంచి కిందికి రావడానికి ఘాట్ రోడ్ లో వాహనదారులు కూడా వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !
Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం
Also Read: Minister Kannababu: మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయి.. త్వరలో చూస్తారు