అన్వేషించండి

Pawan Kalyan: పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్- సినిమాల్లో కొనసాగడంపై జనసేనాని ట్విస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులు ఊహించని పరిణామం జరగబోతోందా... పవన్ చేస్తున్న కామెంట్స్‌ ఆ దిశగానే ఉన్నాయా సినిమాల నుంచి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారా?

Andhra Pradesh Deputy CM Pawan Kalyan Comments On Films: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇకపై సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేయబోతున్నారా? పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాబోతున్నారా? అనే అనుమానం కలిగేలా అభిమానులకు హింట్ ఇచ్చేశారు పవన్. దీంతో ఆయన కామెంట్స్ ఒక్కసారిగా సంచలనంగా మారాయి.

ఇంతకూ పవన్ ఏమన్నారు ?

ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో గ్రామ సభలను తెరమీదకు తెచ్చారు పవన్ కల్యాణ్. సీఏం చంద్రబాబు కూడా దీనికి అంగీకారం తెలపడంతో గ్రామసభ లు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 13వేలకుపైగా పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా తన తొలి గ్రామసభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజక వర్గంలోని మైసూరువారిపల్లిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు పవన్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల కన్నా సమాజం ముఖ్యం అనీ సినిమాల కన్నా దేశం ఇంకా ముఖ్యం అనీ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్న పవన్ తాను సినిమాలు, రాజకీయాలను వేరు వేరుగా చూస్తా అన్నారు.. దానితో పవన్ ఇక సినిమాలకు పూర్తిగా దూరం జరగనున్నారు అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సినిమాల పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో సుజిత్ డైరెక్షన్‌లో వస్తున్న OG సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలాగే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్‌లు పూర్తి కావడానికి కూడా పవన్ డేట్స్ కేటాయించాల్సి ఉంది. మరోవైపు రాజకీయాలు చేయాలి. ఆయన మంత్రిగా ఉండటంతో దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. 

Also Read: ఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు

మొదటి నుంచి సినిమాల కన్నా ప్రజాసేవ వైపే మొగ్గు

పవన్ కు మొదటి నుంచీ ప్రజాసేవ మీదనే దృష్టి.పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా ఆ స్టార్ స్టేటస్ మరో 20 ఏళ్ళ కెరీర్ ఫణంగా పెట్టి మరీ రాజకీయాల్లోకి వచ్చేశారు పవన్. జనసేన స్థాపించి పదేళ్ళ పాటు ఎన్నో అవరోధాలు అవమానాలు ఎదుర్కొని ప్రస్తుత ఎన్నికల్లో 100,% స్ట్రైక్ రేట్‌తో పార్టీనీ గెలిపించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ అయిపోయారు. దానితో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవలే పవన్ తన సినిమాల గురించి మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితిలో తాను OG అంటే ప్రజలు క్యాజీ అంటారంటూ జోక్ చేశారు కూడా. అయితే త్వరలోనే పెండింగ్ సినిమాల షూటింగ్ పూర్తి అవుతుంది అంటూ ఊపు తీసుకొచ్చారు. సినిమా నిర్మాతలు దర్శకులకు ఊరట కల్పించారు.

కానీ ఇప్పుడు పవన్ సినిమాల కంటే సమాజమే ముఖ్యం అంటూ అనడం చూస్తుంటే పవన్ ఇకపై కొత్త సినిమాల్లో నటించరా అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి అభిమానుల్లో ..! అదే జరిగితే ఫ్యాన్స్ గుండెలు బద్దలు కావడం ఖాయం అంటున్నారు సినీ జనం. 

Also Read: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ యాక్షన్ డ్రామా 'రాయన్' - ఆర్ అంటే రివేంజ్, ఓ రేంజ్‌లో ఉంటుంది మరి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Lucknow News: పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
Mandira On OTT: శృంగార తార సన్నీ లియోన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్... ఆహా ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?
శృంగార తార సన్నీ లియోన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్... ఆహా ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget