Mandira On OTT: శృంగార తార సన్నీ లియోన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్... ఆహా ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?
Sunny Leone's Mandira OTT Platform: సన్నీ లియోన్ కొత్త సినిమా ‘మందిర’ ఓటీటీలోకి రెడీ అయ్యింది. రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘ఓ మై ఘోస్ట్’ను ‘మందిర’గా డబ్బింగ్ చేశారు.
‘జిస్మ్ 2’తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ (Sunny Leone) చాలా తక్కువ సమయంలోనే భారతీయ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, కన్నడ, మలయాళ, నేపాలీ భాషల్లో కూడా నటించారు. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ... ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిశారు. మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాలోనూ ఓ కీలక రోల్ చేశారు. ‘జిన్నా’ సినిమాలో దెయ్యంగా భయపెడతారు కూడా. ఆర్. యువన్ దర్శకత్వంలో ‘ఓ మై ఘోస్ట్’ అనే తమిళ సినిమా 2022లో విడుదలై ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో కూడా సన్నీ దెయ్యంగా కాసేపు థ్రిల్ చేశారు.
తెలుగులో విడుదలైన 15 రోజుల్లోనే ఓటీటీలోకి!
‘ఓ మై ఘోస్ట్’... ఈ తమిళ సినిమాను నిర్మాత సాయి సుధాకర్ కొమ్మలపాటి తెలుగులోకి ‘మందిర’గా విడుదల చేశారు. ఈ డబ్బింగ్ వెర్షన్ గత నెల 22న విడుదలైంది. దీనికి థియేటర్లలో స్పందన కరువైంది. సతీష్, యోగిబాబు, రమేశ్ తిలక్, దర్శనా గుప్త కీలక పాత్రలు పోషించారు. తమిళంలో విడుదలైన రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ రూపంలో వచ్చిన ‘మందిర’, 15 రోజులకే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
View this post on Instagram
ఆహా ఓటీటీలో మందిర స్ట్రీమింగ్
‘సన్నీతో గేమ్ ఫన్నీ’గా ఉండదంటూ ఆహా తెలుగు యాప్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఆహా తెలుగు యాప్ లో ఈ నెల 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read: సంక్రాంతికి కాదు... డిసెంబర్‌లోనే ఓటీటీలోకి సూర్య 'కంగువ' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
కామెడీ నవ్వించలేదు
అప్పటి వరకూ పలు తమిళ సినిమాల్లో ఐటెంగాళ్ గా కనిపించారు. ఓ మెయిన్ రోల్ లో కనిపించిన తొలి తమిళ సినిమా ఇదే. సన్నీలియోన్ గ్లామర్ పై ఆధార పడి, ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు యువన్. అడల్ట్ సినిమాలు తీయాలనే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు యువకుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో రాజుల కాలానికి చెందిన పీరియాడిక్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే, కథాకథనాలతో పాటు ఇందులో నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోవడం ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ముఖ్య కారణం. ఐటెంగాళ్ గానే కాకుండా తనకు నప్పే పాత్రలకూ సన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆమె మలయాళంలో ‘రంగీలా’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?