లేటెస్ట్ యూత్ క్రష్ రమ్య పసుపులేటి... నటనలోనూ హుషారే - ఈ అందాల భామ గురించి ఈ విషయాలు తెలుసా? అనుష్క 'పంచాక్షరీ' సినిమాలో రమ్య పసుపులేటి బాలనటిగా నటించారు. అది ఆమె తొలి సినిమా. సినిమాల్లోకి రావడానికి ముందు... మూడేళ్ల వయసులో రమ్య పసుపులేటి కెమెరా ముందుకు వచ్చారు. యాడ్ చేశారు. 'హుషారు'లో ప్రియా పాత్రలో రమ్య నటించారు. ఆహా ఓటీటీలో BFF Web Series చేశారు. 'హుషారు', 'బీఎఫ్ఎఫ్' సిరీస్ తర్వాత 'ఫస్ట్ ర్యాంక్ రాజు', 'కమిట్‌మెంట్' సినిమాలు చేశారు రమ్య. అయితే... బ్యాచిలర్స్ (గ్రాడ్యుయేషన్) కంప్లీట్ చేయడం కోసం సినిమాల నుంచి రమ్య పసుపులేటి చిన్న విరామం తీసుకున్నారు. 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో పూర్తిస్థాయి కథానాయికగా రమ్య పసుపులేటి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'విశ్వంభర'లో మెగాస్టార్ చిరంజీవి చిట్టి చెల్లెలుగా నటిస్తున్నారు రమ్య పసుపులేటి. ఇప్పుడు రమ్య పసుపులేటి వయసు ఎంత అనుకున్నారు? జస్ట్ 23 ఇయర్స్. అందంలో, నటనలో హుషారైన భామగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు రమ్య. లేటెస్ట్ యూత్ క్రష్ లిస్టులో చేరారు.