మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించారు ఆయన అసలు పేరు శివ శంకర వరప్రసాద్ ఆయన సినిమా కోసం చిరంజీవిగా ఎలా మారారు? ఆ పేరు ఆయనకు వచ్చిందో తెలుసా? చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉన్న ఆయన 1976లో చెన్నై వెళ్లి నటనలో శిక్షణ పొందారు మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది.. 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారారు అప్పటి వరకు శివ శంకర వరప్రసాద్‌గా ఉన్న ఆయన స్క్రీన్ నేమ్ కోసం చిరంజీవిగా పేరు మార్చుకున్నారు తన పేరు ఆడ్‌గా ఉందని స్క్రీన్ నేమ్ కోసం వేతుకున్న ఆయనకు ఓ రాత్రి ఓ కల వచ్చిందట కలలో గుళ్లో పడుకుని ఉన్న ఆయనను తన స్నేహితుడు చిరంజీవి ఇలా రా అని పిలిచారట అది తన పేరు కాకపోయిన పలకడం తనకు వింతగా అనిపించిందట ఎలాగో కొత్త పేరు కోసం చూస్తున్న ఆయనకు ఆ దేవుడే ఇది సూచన ఇచ్చినట్టు భావించారట దాంతో ఆ వెంటనే తన పునాది రాళ్లు సినిమా కోసం చిరంజీవి అని పేరు మార్చుకున్నారట