ఆకాష్ పూరీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకుగా 'మహెబుబా' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఎంతోమందిని స్టార్ హీరోలను చేసిన పూరీ కొడుకు చిత్రం అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు కానీ, నటన పరంగా ఆకాష్‌కి మంచి మార్కుల పడ్డాయి ఆ తర్వాత రొమాంటిక్ చిత్రంతో వచ్చాడు, ఈ మూవీ కూడా నిరాశే పరిచింది ఆ తర్వాత 2022లో నటించని చోర్ బజార్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఆకాష్ పూరీ తెరపై కనిపించి రేండేళ్లు దాటింది, దాంతో అంతా ఏ సినిమా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారట సినిమా అనౌన్స్ చేయమని కొరుతున్నారట, ఈ క్రమంలో తాజాగా ఆకాశ్ పూరీ ఓ వీడియో రిలీజ్ చేశాడు ఇందులో తానేం ఖాళీగా లేనని, ఈ గ్యాప్ చాలా కథలు విన్నానంటూ చెప్పుకొచ్చాడు తనకు ఒక అద్భుతమైన కథ దొరికిందని, మంచి ప్రొడక్షన్ హౌజ్‌లో సినిమా చేయబోతున్నాని చెప్పాడు దీంతో పూరీ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు