![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kiran Abbavaram: నేను మీకు బాగా కావాల్సిన వాడిని, ఆదరించండి - హీరో కిరణ్ అబ్బవరం!
Kiran Abbavaram: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం "నేను మీకు బాగా కావల్సినవాడిని" చిత్ర బృందానికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన వినాయకచవితి ప్రీ ఈవెంట్ కు హాజరయ్యారు.
![Kiran Abbavaram: నేను మీకు బాగా కావాల్సిన వాడిని, ఆదరించండి - హీరో కిరణ్ అబ్బవరం! Kiran Abbavaram Participated Idupulapaya Vinayaka Chavithi Pre Release Event Kiran Abbavaram: నేను మీకు బాగా కావాల్సిన వాడిని, ఆదరించండి - హీరో కిరణ్ అబ్బవరం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/ed82d70e33f0c4710262deb764c232dc1661068736585519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన పేరు కాబట్టి. ఇండస్ట్రీ లో ఎదగడానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది అంటారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరనుంచి మొదలు పెడితే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి ఎంతోమంది గురించి చెప్పొచ్చు ప్రస్తుతం ఇదే లిస్ట్ లో ఈ మధ్య కాలంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరాడని చెప్పొచ్చు.
వినాయక చవితి ప్రీ ఈవెంట్ కు వెళ్లిన చిత్ర బృందం..
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టి "రాజావారు రాణిగారు" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్, అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సాధించుకున్నాడు. తన రెండవ సినిమా ఎస్.ఆర్. కళ్యాణ్ మండపం సినిమాతో ఒక రచయితగా కూడా మంచి మార్కులు సాధించాడు. కేవలం వినోద భరితమైన సినిమాలు మాత్రమే కాకుండా సెబాస్టియన్ లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా చేసాడు తన కెరియర్ లో. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం "నేను మీకు బాగా కావాల్సినవాడిని" అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇదివరకే రిలీజైన టీజర్ కు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ యంగ్ హీరో ఇడుపుల పాయలోని ట్రిపుల్ ఐటీ కళాశాలను సందర్శించారు. అక్కడ కూడా ఈ యంగ్ హీరోకి, చిత్ర యూనిట్ కి అనూహ్యమైన స్పందన లభించింది.
చదవులో నేనెప్పుడూ ఆఖరుకే..
ఈ కార్కక్రమంలో మాట్లాడుతూ... నేను మీలా పెద్దగా చదువుకోలేదు.. అదృష్టం కొద్దీ హీరోను అయ్యాను.. నాకంటే మీరే కష్టపడి చదివి ట్రిపుల్ ఐటీకి వచ్చారని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఈయనతో పాటు హీరోయిన్లు సోనూ ఠాకూర్, సంజనలు వచ్చారు. వీరంతా కలిసి "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం టీజర్ ను ప్రదర్శించారు. వచ్చే నెల 9వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని.. ప్రతీ ఒక్కరూ సినిమా చూడాలని కిరణ్ కోరారు. తనకు ఎంసెట్ లో 1,23,199 ర్యాంకు వచ్చిందని, చదువులో తానెప్పడూ లాస్టేనని తెలిపారు.
పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం..
ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెంబరన్ వన్ గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా కిరణ్ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలో సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మంచి కథలను ఎన్నుకోవడం, మంచి సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులకి, మీడియా ప్రతినిధులకి గౌరవాన్ని చూపించడం, అలానే అభిమానులకి చేరువగా ఉంటూ మాట్లాడటం లాంటి విషయాలు కిరణ్ అబ్బవరం పై సదాభిప్రాయం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)