By: ABP Desam | Updated at : 27 Nov 2022 06:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
దురంతో ఎక్స్ ప్రెస్ లో మంటలు
Duronto Express : చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో దురంతో ఎక్స్ ప్రెస్ లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి హౌరా వెళ్తోన్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఎస్-9 బోగీలో దట్టమైన పొగలు వచ్చాయి. ఇది గమనించిన లోకో పైలెట్ ట్రైన్ ను కుప్పం రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. పొగలు రావడంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో రైలు బయలుదేరింది.
అసలేం జరిగింది?
చిత్తూరు కుప్పం రైల్వే ష్టేషన్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దురంతో ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. మంటలు, దట్టమైన పొగలు గమనించిన ప్రయాణికులు భయంతో కిందికి దిగి పరుగులు తీశారు. బెంగళూరు నుంచి హౌరా వెళ్తోన్న ట్రైన్ కుప్పం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయి. రైలులో మంటలను గుర్తించిన లోకో పైలెట్ కుప్పం రైల్వే స్టేషన్ లో ట్రైన్ ను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులుపెట్టారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే కిందికి దిగి దూరంగా వెళ్లడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదని స్పష్టం చేశారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయో ఇంకా తెలియాల్సి ఉందని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగళూరు నుంచి హవ్ డా వెళ్తోన్న ట్రైన్ కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
రైల్వే శాఖ క్లారిటీ
ఈ ప్రమాదంపై రైల్వే శాఖ స్పందించింది. దురంతో ట్రైన్ లో మంటలు ఘటన అవాస్తవం అని తెలిపింది. బ్రేక్ బైడింగ్ వల్ల పొగలు వ్యాపించాయని తెలిపింది. దీంతో రైలును నిలిపివేసి తక్షణ చర్యలు చేపట్టారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణకు ఆదేశించలేదని క్లారిటీ ఇచ్చారు.
శబరిమల ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప సీజన్ మొదలు అయింది. మండల కాలంపాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకుంటారు. ఈ 41 రోజుల పాటు అత్యంత నియమ నిష్ఠలు పాటించి అయ్యప్పను పూజిస్తారు. 41 రోజుల అయ్యాక స్వాములు శబరి యాత్రకు వెళ్తారు. అలా శబరి వెళ్లే అయ్యప్ప దీక్షాపరులు, అయ్యప్ప స్వామి భక్తుల కోసం రైల్వే శాఖ గొప్ప సౌకర్యాన్ని కల్పించనుంది. ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుండి సికింద్రాబాద్ కు నడుస్తాయని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి
సికింద్రాబాద్ - కొల్లాం (07117) డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07118) డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ - కొల్లాం(07121) ఈనెల 27వ తేదీ, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో నడవనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ - కొల్లాం(07123) ఈ నెల 28 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్(07124) ఈ నెల 30 తేదీల్లో, సికింద్రాబాద్ - కొట్టాయం (07125) ఈ నెల 27 తేదీల్లో నడవనున్నాయి. కొట్టాయం - సికింద్రాబాద్ (07126) ఈ నెల 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
Weather Latest Update: తెలంగాణలో కొనసాగుతున్న చలి, అతితక్కువ ఉష్ణోగ్రత ఎక్కడంటే
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !
YSRCP Corporator on Kotamreddy: ఆ ఎమ్మెల్యే నన్ను చంపేస్తాడు, నాకు ప్రాణహాని ఉంది? : కోటంరెడ్డిపై కార్పొరేటర్ సంచలన ఆరోపణలు
Aadala In Nellore: ఆదాల వెంటే ఉంటాం, సీఎం జగన్ చెప్పినట్టే నడుచుకుంటాం - కొత్త ఇంఛార్జ్ కు పూర్తి మద్దతు
Minister Dharmana Prasadarao : చంద్రబాబు కన్నా ముందే వాలంటీర్లు తుపాకీ పేల్చాలి, ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పే హక్కు మీకుంది - మంత్రి ధర్మాన
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!