By: ABP Desam | Updated at : 18 Jan 2022 05:14 PM (IST)
పవన్ కల్యాణ్(ఫైల్ ఫొటో)
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు ఆందోళనకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు సేవలందించే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది అధిక సంఖ్యలో కొవిడ్ బారిన పడున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్ పరీక్షలు, పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని, మొబైల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని అన్నారు. కరోనా మొదటి వేవ్‌లో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ వ్యతిరేకించారు. ఏపీలో నైట్ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధం ఉన్నా.. పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు సరికాదని చెప్పారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గే వరకు తరగతులు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తికాకపోవటం, వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరి అని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి, వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలని..., మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Case On PVP : డీకే అరుణ కుమార్తె ఇంటి గోడను కూలగొట్టించిన వైఎస్ఆర్‌సీపీ నేత పీవీపీ .. కేసు నమోదు !
Also Read: AP PRC Agitation : పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదన్న ఏపీ ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు సిద్ధమని ప్రకటన !
Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి
Also Read: WHO on Covid 19: భారత్ ఇలా చేస్తే కేసులు తగ్గుతాయి.. లాక్‌డౌన్ అక్కర్లేదు: WHOలో భారత ప్రతినిధి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
East Godavari News : ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్లో విన్నర్గా నిలిచిన లక్నో!