By: ABP Desam | Updated at : 18 Jan 2022 04:52 PM (IST)
బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె ఇంటి గోడను కూలగొట్టించిన పీవీపీ - కేసు నమోదు
ప్రముఖ నిర్మాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్‌పై మరో కేసు నమోదైంది. తెలంగాణ సీనియర్ నేత డీకే అరుణ కుమార్తె..తన ఇంటి గోడను పీవీపీ తన అనుచరులతో కూలగొట్టించారని ఫిర్యాదు చేశారు. ఈ మేరుక బంజారాహిల్స్ పోలీస్‌స్టేషనులో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె శ్రుతిరెడ్డి నివసిస్తున్నారు. పీవీపీ అనుచరుడు బాలాజీ, మరికొందరు శ్రుతిరెడ్డి ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ప్రహరీని యంత్రాలతో ధ్వంసం చేశారు. రేకులను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన శ్రుతిరెడ్డిని బెదిరించారు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరప్రసాద్, బాలాజీలతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
Also Read: Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...
బంజారాహిల్స్‌లో పొట్లూరి వరప్రసాద్ తన రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ వేసి విల్లాలు అమ్ముకున్నారు. ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నారు. అయితే అక్కడ విల్లాలు కొనుక్కున్న వారు ఇళ్లల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆయన అడ్డుకుంటున్నారు. 2020 జూన్‌లో ఇలా ఇలా ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలు కూలగొట్టారన్న కేసు పీవీపీపై నమోదైంది. ఈ కేసులో ఆయనను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులపై కుక్కల్ని వదలడం వివాదాస్పదం అయింది.
Also Read: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..
విచారణకు వెళ్తే కుక్కుల్ని తమపై వదిలారని ఎస్‌ఐ ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్ చేశారు.అప్పుడు ఆయనను పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. తర్వాత కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే విల్లాస్‌లో డీకే అరుణ కుమార్తె ఇంటిపైకి అదే విధంగా వెళ్లడంతో మరో కేసు నమోదైంది.
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!
అయితే విల్లాలు అమ్మిన సమయంలోనే నిబంధనలు రాసుకున్నామని ఎవరూ ఎవరి ఇళ్లలోనూ మార్పులు, చేర్పులు చేయకూడదన్న నిబంధన ఉందని పీవీపీకి చెందిన వ్యక్తులు చెబుతున్నారు. అయినా వినకుండా నిబంధనలు.. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నందునే కూలగొడుతున్నామని అంటున్నారు. డీకే అరుణ కుమార్తె పెట్టిన కేసుపై పోలీసీలు ఇంకా పీవీపీని ప్రశ్నించలేదు. ప్రశ్నించిన తర్వాత కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kurnool: అన్నపై చెల్లెలు పైశాచికం, తల్లి సపోర్ట్‌తో ప్రియుడితో కలిసి ఘోరం - వీడిన మిస్టరీ కేసు
Nizamabad News: సుద్దులం గ్రామంలో దొంగలను చాకచక్యంగా పట్టుకున్న గ్రామస్థులు
Texas: సరిహద్దులోని ట్రక్కులో 46 మృతదేహాలు- అసలేం జరిగింది?
Juvenile Escaped: జువైనల్ హోం నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరార్, పోలీసులకు టెన్షన్ టెన్షన్
Uttarakhand Gang Rape : కదిలే కారులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం - ఉత్తరాఖండ్‌లో మరో నిర్భయ !
Chiru In Modi Meeting : మోదీ, జగన్‌తో పాటు చిరంజీవి కూడా ! - నాలుగో తేదీన ఏపీలో
Weather Updates: రెయిన్ అలర్ట్ - ఏపీలో అక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో ఆ ప్రాంతాలకు IMD వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Horoscope 29th June 2022: ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి