(Source: ECI/ABP News/ABP Majha)
Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. పోలీసు శాఖపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. హైదరాబాద్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలలో కరోనా కలకలం రేగుతోంది.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పోలీస్ శాఖపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా హైదరాబాద్ సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల ఓ కేసు విషయంలో రాజస్థాన్ వెళ్లి వచ్చిన ఎస్సైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతని నుంచి మిగతా సిబ్బందికి సోకినట్లు తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసులు హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స పొందుతున్నారు. యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఏసీపీ, సీఐ సహా 12 మందికి కరోనా సోకింది.
ఎల్బీనగర్ పీఎస్ లో
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డీఐ, ఎస్ఐ, 4 గురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. మాస్క్ లేకుండా స్టేషన్ లోకి ఎవ్వరిని అనుమతించని పోలీసులు చెబుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో
బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్సై, 5గురు కానిస్టేబుల్ లకు కరోనా సోకింది. మీర్పేట్ పీస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై, ఏఎస్సై, 9 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. చైతన్యపురి పీఎస్ లో 8 మంది కానిస్టేబుల్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
Also Read: కేంద్ర మంత్రికి లేఖ రాసిన హరీశ్ రావు.. వ్యాక్సిన్ గడువు తగ్గించాలని విజ్ఞప్తి
నార్సింగి పీఎస్‌లో
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో 20 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన పోలీసులందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్ బారినపడటంతో స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఫిర్యాదుదారుల కోసం పోలీసుస్టేషన్ ఎదుట టెంట్ ఏర్పాటుచేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
హయత్‌నగర్ పీఎస్‌లో..
హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో 15 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, 14 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు.
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి