AP PRC Agitation : పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదన్న ఏపీ ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు సిద్ధమని ప్రకటన !

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోకపోతే సమ్మెకైనా సిద్ధమని ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. జీతాలు తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమని వారంటున్నారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదని చెబుతున్నాయి. రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఈ పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇంత వరకూ ఏ ప్రభుత్వం కూడా  ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్ తగ్గించలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తగ్గించడమే కాకుండా..  హెచ్‌ఆర్‌ఏ, సీసీే రిటైరైన ఉద్యోగులతో క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సహా అనేక అంశాల్లో కోతలు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

ఉద్యోగ సంఘాలతో ఎవరూ మాట్లాడకుండా జీవో జారీ చేశారని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయయులపై ప్రేమ లేదని.. డీఏ లు అడ్డుపెట్టుకుని  పిఆర్సీ ఇచ్చారని మండిపడ్డారు. మాకు ఈ పిఆర్సీ ఆమోదయోగ్యమైనవి కాదని..పిఆర్సీకి  జీఓలు మాకు వద్దని ప్రకటించారు. ప్రభుత్వం  మాకు  వ్యతిరేకంగా  జీఓ లు ఇచ్చిందని..ఉద్యోగ ఉపాధ్యాయ  పెన్షనర్లు   ఏక  తాటి పైకి  వచ్చి  ప్రకటించే  కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు. సమ్మె కు  వెళ్ళడానికి  కూడా సిద్ధంగా ఉన్నామని..సీఎం  జోక్యం  చేసుకోవాలని డిమాండ్ చేశారు.  రేపు, ఎల్లుండి ఉద్యోగ కమిటీ  సమావేశాలు  పెట్టుకుని కార్యాచరణ ఖరారు చేస్తామని.. ప్రకటించారు. ఇప్పటికే అన్ని జిల్లాలో  నల్ల  బ్యాడ్జీ లతో  నిరసన  తెలుపుతున్నామన్నారు.  ప్రభుత్వం జీవోలు వెనక్కి తీసుకునేవరకూ ఉద్యమం చేస్తామని ప్రకటించారు. 

Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమానికి సిద్ధమయ్యాయి. పి ఆర్ సి పేరుతో చర్చలకు పిలిచి,  సంఘాలను మాట్లాడనీయకుండా ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించడమే కాకుండా, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఆవేదనను కూడా పరిగణనలోకి తీసుకోకుండా PRC జీ ఓ లు విడుదల చేసిన తీరు అప్రజాస్వామిక మైనదని, ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని యూటీఎఫ్ నేతలు ప్రకటించారు.   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర వేతన సంఘం పరిధిలోకి తీసుకువెళ్లడం, మాస్టర్ స్కేల్ కంటే దిగువున గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలు నిర్ణయించడం ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తోంది అనడానికి తార్కాణమని ఉద్యోగ నేతలంటున్నారు.  

Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?

సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించినప్పుడు ఉద్యోగ సంఘ నేతలందరూ ఉన్నారు. సీఎం చెప్పిన వాటన్నింటికీ ఉద్యోగ సంఘ నేతలు తల ఊపారు. చప్పట్లు కొట్టి సీఎం జగన్‌ను అభినందించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోల వల్ల తమ జీతాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో ఉద్యోగ సంఘ నేతలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. 
 
Also Read: ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 18 Jan 2022 12:17 PM (IST) Tags: cm jagan AP government PRC controversy employees angry over PRC organisms. AP employees heading towards strike

సంబంధిత కథనాలు

Bhavani Island: ప‌ర్యాట‌క అద్బుతం విజయవాడ భ‌వానీ ఐల్యాండ్, న‌ది మ‌ధ్యలో ప్ర‌కృతి అందాలు

Bhavani Island: ప‌ర్యాట‌క అద్బుతం విజయవాడ భ‌వానీ ఐల్యాండ్, న‌ది మ‌ధ్యలో ప్ర‌కృతి అందాలు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య  కీలక వ్యాఖ్యలు

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Breaking News Live Updates: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం

Breaking News Live Updates: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్