అన్వేషించండి

Janasena News: పిఠాపురంలో పవన్ కొంపముంచేలా గుర్తుల కలకలం, జనసేన ఆరోపణలు - రంగంలోకి నాగబాబు

Pawan Kalyan News: పిఠాపురంలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసి స్క్రూటినీ పూర్తయ్యాక మళ్ళీ నామినేషన్ పత్రాలు ఎందుకు తెరిచారని జనసేన పార్టీ ప్రశ్నించింది.

Pithapuram Constituency: పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అధికారులు సార్వత్రిక ఎన్నికల నియమావళిని మార్చేసే ప్రయత్నం చేపట్టారని జనసేన పార్టీ ఆరోపించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసి స్క్రూటినీ కూడా పూర్తయ్యాక మళ్ళీ నామినేషన్ పత్రాలు తెరిచారని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. సదరు నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందని అన్నారు. 

‘‘తెలుగు జాతీయ పార్టీ తరపున పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థి పిఠాపురంలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు.. నామినేషన్ దాఖలు చేసే సందర్భంలోనే బ్యాట్ గుర్తుతో పాటుగా మరొక రెండు గుర్తులు తమకు కేటాయించాల్సిందిగా ఎన్నికల కమిషన్ అధికారులను అభ్యర్థించారు. అభ్యర్థి స్క్రూటినీ పూర్తయిన తరువాత ఎన్నికల గుర్తును అభ్యర్తించే విషయంలో పొరపాటు జరిగిందని తెలుపుతూ, తనకు గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని చెప్తూ నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం పిఠాపురం అధికారులు చేశారు. అంతటితో ఆగకుండా సంబంధిత అభ్యర్థికి పెన్ స్టాండ్ గుర్తును కేటాయించే ప్రయత్నం కూడా ఎన్నికల కమిషన్ అధికారులు చేపట్టారు. 

ఓట్లు బదలాయించే కుట్ర జరుగుతోందా..?
నామినేషన్ పత్రాలు అందజేసే విషయంలో పొరపాటు చేశాను అని స్వయంగా లిఖిత పూర్వకంగా రాసిచ్చిన అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించకుండా, దానిలో మరో అనుమానాస్పద పత్రాలు జత చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అడిగిన వెంటనే గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించే ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిస్తోంది. గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించడం ద్వారా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ కి వేసే ఓట్లను గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుకు బదలాయించే కుట్ర జరుగుతుందనే అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్వయంగా కార్యాలయానికి వెళ్లి పిఠాపురం అధికారులను సంబంధిత అంశం గురించి వాకబు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు’’ అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget