(Source: ECI/ABP News/ABP Majha)
Ex MLA Chinthamaneni: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల
పశ్చిమ గోదావవరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు విడుదల చేశారు. దెందులూరులో పెట్రో ధరలపై నిరసన కార్యక్రమం చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‍ను దెందులూరు పోలీసులు బెయిల్ పై విడుదల చేశారు. ఆయన స్వగ్రామం పెదవేగి మండలం దుగ్గిరాలకు వెళ్లారు. శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై టీడీపీ నిరసనలు చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై నిర్వహించిన ధర్నాలో చింతమనేని పాల్గొన్నారు. ఈ ధర్నా విషయమై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది.
ఆదివారం రాత్రి ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు. వివాహ కార్యక్రమానికి హాజరైన వస్తున్న చింతమనేనిని.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు తరలించారు. ఇప్పటికే పలుమార్లు చింతమనేని అరెస్టు అయ్యారు.
Also Read: Kashmir Terrorism: కశ్మీర్ లో ఉగ్రవాదానికి త్వరలోనే క్లైమాక్స్: రాజ్ నాథ్
నిరసన చేస్తుండగా.. పోలీసుల తీరుపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చింతమనేనికి, పోలీసులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. చివరకు అధికారులకు చింతమనేని ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. అనంతరం టీడీపీ, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పెళ్లికి హాజరై వస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అయితే చింతమనేని అరెస్టు అయ్యాక... ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
Also Read: India Taliban Relations: 'భారత్'తో బలమైన బంధం కావాలి.. కానీ 'పాక్' మాకు బ్రదర్: తాలిబన్లు
మరోవైపు చింతమనేని అరెస్టుపై తెదేపా నేతలు మండిపడ్డారు. పెట్రో ధరలపై నిరసన తెలపడం నేరమా? ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా? అని అచ్చెన్నాడుయు ప్రశ్నించారు. కేసులు, అరెస్టులతో తెదేపా నేతలను అడ్డుకోలేరని చెప్పారు. పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు ఉదాహరణ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Woman Arrested: ప్రియుడి కోసం కన్నబిడ్డకు చిత్రహింసలు.. ఏపీ మహిళను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు