X

India Taliban Relations: 'భారత్'తో బలమైన బంధం కావాలి.. కానీ 'పాక్' మాకు బ్రదర్: తాలిబన్లు

భారత్ తో సంబంధాలపై తాలిబన్లు తొలిసారి స్పందించారు. ఈ ప్రాంతంలో భారత్ ముఖ్య దేశమని.. వారితో బలమైన బంధాన్ని తాము కోరుకుంటున్నామన్నారు.

FOLLOW US: 

ఓవైపు అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరుగుతుంటే మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఉత్సాహంగా ఉన్నారు. అయితే తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారత్ తో సంబంధాలు ఎలా ఉంటాయి? భారత్ తో తిరిగి అదే స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను తాలిబన్లు కొనసాగిస్తారా? ఈ ప్రశ్నలకు తాలిబన్ సీనియర్ లీడర్ షేర్ మహ్మద్ అబ్బాస్ తానేక్ జాయ్ సమాధానమిచ్చారు.

భారత్ తో వాణిజ్య, ఆర్థిక, రాజకీయ సంబంధాలను కొనసాగించాలని తాము ఆశిస్తున్నట్లు అబ్బాస్ అన్నారు. ఈ ప్రాంతంలో భారత్ ను ఓ ముఖ్యదేశంగా అభివర్ణించారు.

Also Read: Pocso Case: యువతిపై పోక్సో కేసు నమోదు... మైనర్ తో ఆ పనిచేసినందుకే... రిమాండ్ విధించిన కోర్టు

పాకిస్థాన్ కీలకం..

భారత్- అఫ్గానిస్థాన్ వాణిజ్య సంబంధాల్లో పాకిస్థాన్ పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఎగుమతులు, దిగుమతులు పాకిస్థాన్ మీదుగానే వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు తాలిబన్ సోషల్ మీడియా ఖాతాల్లో ఆయన 46 నిమిషాల వీడియోను పెట్టారు. ఇప్పటివరకు ఇతర దేశాలతో సంబంధాలపై తాలిబన్లు స్పందించలేదు. 

ప్రభుత్వ ఏర్పాటుపై..

ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు కోసం వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలతో చర్చిస్తున్నట్లు అబ్బాస్ అన్నారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకుపోతుందని ఆయన అన్నారు.

" వివిధ గ్రూపులు, రాజకీయ పార్టీలు, ఇస్లామిక్ ఎమిరేట్స్ తో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ నాయకత్వం చర్చలు జరుపుతోంది. దేశం సహా ప్రపంచం గుర్తించే మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.                              "
-    షేర్ మహ్మద్ అబ్బాస్ తానేక్ జాయ్, తాలిబన్ సీనియర్ నేత

చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, రష్యాతోనూ మంచి సంబంధాలను కోరుకుంటున్నామన్నారు. మిలియన్ల మంది అఫ్గాన్ శరణాగతులకు ఆశ్రయం కల్పించినందుకు పాకిస్థాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ తో సోదర సంబంధాలను అఫ్గాన్ కోరుకుంటుందన్నారు.

ఉద్రిక్త పరిస్థితులు..

ప్రస్తుతం కాబూల్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టు పై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు ఉదయం కాబూల్ విమానాశ్రయంపైకి ఐదు రాకెట్లు దూసుకొచ్చాయి. అయితే క్షిపణి రక్షణ వ్యవస్థా వాటిని కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ దాడులను అమెరికా కూడా ధ్రువీకరించింది. 

Also Read: Afganisthan Crisis Update: కాబూల్ విమానాశ్రయంపై రాకెట్ల వర్షం.. 'డెడ్ లైన్'కు ముందు ఉద్రిక్తత

Tags: Pakistan kabul taliban india trade Afghanistan India ties Afghanistan India relation

సంబంధిత కథనాలు

Anantapur: ఆధార్ లో తప్పు ఆధారం లేకుండా చేసింది... అనంతపురంలో ఓ వృద్ధుడి దీనపరిస్థితి

Anantapur: ఆధార్ లో తప్పు ఆధారం లేకుండా చేసింది... అనంతపురంలో ఓ వృద్ధుడి దీనపరిస్థితి

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Anasuya says Give Respect: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ

Anasuya says Give Respect: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Kadapa RIMS: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

Kadapa RIMS: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Anushka: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..

Anushka: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..

Alcohol: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?

Alcohol: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?

Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!

Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!