By: ABP Desam | Updated at : 30 Aug 2021 12:08 PM (IST)
యువతిపై పోక్సో కేసు(ప్రతీకాత్మక చిత్రం)
తమిళనాడులో 19 ఏళ్ల యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ ని వివాహం చేసుకున్న కేసులో యువతికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. తమిళనాడు పొల్లాచికి చెందిన 19 ఏళ్ల యువతి స్థానికంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తోంది. ఆ ప్రాంతంలో ఉంటున్న 17 ఏళ్ల యువకుడితో ప్రేమ వ్యవహరం నడిపింది. వీరిద్దరూ కలిసి పెట్రోల్ స్టేషన్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ సమయంలో యువకుడు ఓ సర్జరీ కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. యువతి ఆసుపత్రికి వెళ్లి పెళ్లి సంబంధాల విషయం యువకుడికి చెప్పింది.
Also Read: Hymenoplasty Surgery: ఇలా కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చట.. వివాదాస్పద సర్జరీపై నిరసనలు
బలవంతంగా పెళ్లి
ఇంట్లో పెద్దలు పెళ్లి నిశ్చయించే ముందే పెళ్లి చేసుకుందామని యువకుడిని బలవంతం పెట్టింది. ఆ తర్వాత దగ్గర్లోని దేవాలయానికి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం ఈ విషయం యువకుడి ఇంట్లో తెలిసింది. ఇంటికి వచ్చిన యువకుడిని తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో పెళ్లి విషయాన్ని చెప్పేశాడు. 19 ఏళ్ల యువతితో వివాహం చేసుకున్నట్లు తల్లిదండ్రులకు వివరించాడు. ఈ వ్యవహారంపై యువకుడి తల్లిదండ్రులు యువతిపై పొల్లాచి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read: Hyderabad Crime: అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త.. సాయం చేసిన కూతురు
రిమాండ్ విధింపు
ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. యువకుడిని బలవంతం చేసి పెళ్లికి ఒప్పించినట్లు నిర్థారించుకున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన కోయంబత్తూరు జిల్లా ఎస్పీ యువతిని అరెస్టు చేయాలని ఆదేశించారు. యువతిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది.
Petrol-Diesel Price 03 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
JEE Main 2024: జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు నేటితో ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా
Top Headlines Today: నేడు తెలంగాణ సీఎం పేరు ఖరారు; జంపింక్‌కు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు - నేటి టాప్ న్యూస్
Weather Latest Update: రేపు తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం - ఏపీలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు: ఐఎండీ వార్నింగ్
Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>