Chiranjeevi Meets Kapildev: ఒకరు క్రికెట్ దిగ్గజం..మరొకరు ఇండస్ట్రీమెగాస్టార్..ఒకే ఫ్రేమ్‌లో ఎప్పుడు.. ఎక్కడ..
మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ని కలిసిన ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత పాతమిత్రుడిని కలిసానంటూ చిరు ట్వీట్ చేశాడు. ఆ విశేషాలేంటో చూద్దాం...
రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో మాంచి జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి..ఎప్పటికప్పుడు అప్ డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు. కొన్ని ఫన్నీగా, కొన్ని సీరియస్‌గా, కొన్ని సందేశాత్మకంగా ఇలా డిఫరెంట్ ట్వీట్లతో తన భావాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత దేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసిన చిరంజీవి ఇది ఎంతో స్పెషల్ అంటూ కామెంట్ చేశాడు.
Wonderful meeting my old friend @therealkapildev after a long time. The exquisite #FalaknumaPalace setting made it even more special. Travelled back in time at multiple levels & Fondly recalled old memories.He is very much the #HaryanaHurricane who won us our #FirstWorldCup pic.twitter.com/Y4Ezfhp65j
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 29, 2021
1983లో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కపిల్ భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. తొలిసారి భారత జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపారు. కెప్టెన్‌గా భారత్‌కు ఆయన మరెన్నో మరుపులేని విజయాలు అందించారు. అలాంటి కపిల్‌దేవ్‌ను కలిశానంటూ చిరు ట్వీట్ చేశారు. ఫలుక్‌నామా ప్యాలెస్‌లో జరిగిన ఓ సమావేశంలో కపిల్‌దేవ్‌ను మెగాస్టార్ కలిశారు. మెగాస్టార్ భార్య సురేఖ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం
ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఒక్కసారిగా గతంలోకి వెళ్లి.. ఆ రోజులను గుర్తు చేసుకున్నాను అంటూ.. ఆయనే మనకు మొదటి ప్రపంచకప్ అందించిన హరియాణా హర్రీకేన్ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. అయితే ఈ భేటీ ఎందుకు జరిగింది అన్నది మాత్రం ఆయన ఎక్కడ చెప్పలేదు.
Also read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!
ఇక కపిల్ దేవ్ బయోపిక్ 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు.
మెగాస్టార్ మూవీస్ విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ పనులతో పాటూ తన తదుపరి ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లోనూ పాల్గొంటున్నారు. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతోన్న గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న వేదాళం రీమేక్ బోళా శంకర్ సినిమాతో చిరు బిజీగా ఉన్నారు. 2015లో అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ వేదాళం కి భోళా శంకర్ ఆఫీషియల్ రీమేక్. ఈ మూవీలో చిరు చెల్లి పాత్రను కీర్తి సురేష్ చేయడం మరో విశేషం. వీటి తర్వాత బాబి దర్సకత్వంలో మరో మూవీకి కమిటయ్యారు చిరంజివి. రీఎంట్రీ ఇచ్చినప్పుడు సినిమా సినిమాకి కొంత బ్రేక్ తీసుకున్నా ఇప్పుడు మాత్రం మెగా మేళా అన్నట్టు వరుస చిత్రాలతో దూసుకొస్తున్నారు మెగాస్టార్.
Also Read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే