(Source: ECI/ABP News/ABP Majha)
Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం... గేదె కళేబరం పైకెక్కి అదుపు తప్పి టిప్పర్ ను ఢీకొట్టిన ఆటో... ఐదుగురు మృతి
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలో టాటా మ్యాజిక్ వాహనం టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చనిపోయిన గేదెను ఢీకొట్టిన టాటా మ్యాజిక్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలం రోలుగుంపాడు సమీపంలో ప్యాసింజర్లతో ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ ఆటో రోడ్డుపై చనిపోయిన గేదెపైకి ఎక్కింది. దీంతో అదుపు తప్పిన ఆటో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also Read: Coronavirus India Update: భారత్‌లో తగ్గని కరోనా ప్రభావం.. తాజాగా 42 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
పెళ్లి సంబంధం మాట్లాడుకుని వస్తుండగా...
ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, కోటమ్మ, ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. బేస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంధువులతో కలసి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సంబంధం మాట్లాడుకుని తిరిగి వెళ్తున్న వారిని మార్గమధ్యలో మృత్యువు కబళించింది.
Also Read: Chintamaneni Arrest : చింతమనేని అరెస్టుతో రాజకీయ దుమారం ! పోలీసులపై టీడీపీ తీవ్ర విమర్శలు..!
డోన్ లో ఏటీఎం చోరీ
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏటీఎం చోరీ కలకలం రేపుతోంది. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎం నుంచి నగదు దొంగలించడానికి దుండగులు గ్యాస్ కట్టర్, గడ్డపారలు ఉపయోగించారు. వీటితో రెండు ఏటీఎం మిషన్స్ నుంచి సొమ్ము దొంగిలించారు. దొంగతనానికి పాల్పడిన దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చోరీ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎంలో ఉన్న నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Vizag Capital Row : "ఏపీ రాజధాని"తో కేంద్రం చెలగాటం..! ప్రతీసారి ఈ వివాదమెందుకు ?