అన్వేషించండి

Hymenoplasty Surgery: కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చా? వర్జినిటీ రిపేర్ పేరుతో వైద్యులు ఏం చేస్తున్నారు?

కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చా? అదెలా సాధ్యం? ఆ సర్జరీలో వైద్యులు ఏం చేస్తారు? ఈ సర్జరీని ఎందుకు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు?

పెళ్లి చేసుకోబోయే పురుషులు.. తమ భార్య కన్యగా ఉండాలని, ఆమెకు ఎలాంటి సెక్స్ అనుభవం ఉండకూడదని కోరుకుంటారు. అయితే, కన్యత్వం అనేది.. సెక్స్ మీద ఆధారపడి ఉండదని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు. యోనిలో ఉండే హైమన్ అనే కన్నె పొర శరీరతత్వాన్ని బట్టి సెక్స్ కంటే ముందే చీలుతుందని, ఆటలు ఆడే అమ్మాయిల్లో కూడా ఈ సమస్య ఏర్పడుతుందని వెల్లడించారు. అయితే, ఇప్పటికీ చాలామంది కన్నెపొర చిట్లితేనే వర్జిన్ అనే భావనతో ఉంటున్నారు. దీంతో కన్యత్వాన్ని తిరిగి పొందే సర్జరీలకు డిమాండ్ పెరుగుతోంది. కన్యత్వం పోవడమంటే.. పలుచగా ఉండే కన్నె పొర చిరిగిపోవడం. మరి, అది పూర్తిగా తొలగిపోయిన తర్వాత మళ్లీ కన్యత్వాన్ని ఎలా పొందగలరు? ఇందుకు వైద్యులు ఏం చేస్తున్నారు?

కన్యత్వాన్ని తిరిగి పొందే సర్జరీని ‘హైమనోప్లాస్టీ’ అని అంటారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ సర్జరీలు జరుగుతున్నాయి. అయితే, ఇది కేవలం అమెరికా, యూకే  వంటి దేశాల్లో మాత్రమే ఉండేది. తాజాగా ఇది మన ఇండియాలోని మెట్రో సిటీలకు కూడా పాకింది. ఇటీవల పెళ్లికి ముందే ఆ అనుభవం పొందేవారి సంఖ్య పెరిగింది. చిన్న వయస్సులోనే లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తమ భాగస్వామితో ఏమైనా సమస్యలు వస్తాయనే భయాందోళనలతో అమ్మాయిలు వైద్యులను సంప్రదిస్తున్నారు. అలాంటివారికి వైద్యులు ఈ హైమనోస్లాస్టీ సర్జరీ నిర్వహిస్తున్నారు.

హైమనోప్లాస్టీ సర్జరీలో భాగంగా కన్నెపొర కోల్పోయిన అమ్మాయిల యోని లోపల పలుచని పొరను ఏర్పాటు చేస్తారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్‌కు సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పెళ్లికి సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల ముందే ఈ సర్జరీ చేయించుకోవాలట. ఆ తర్వాత ఆ యువతి సెక్స్, స్వయంతృప్తికి దూరంగా ఉండాలి. సైకిల్ తొక్కడం, వ్యాయామాలు చేయడం, పరుగులు పెట్టడం.. చివరికి స్కూటర్ కూడా నడపకూడదట. ఈ సర్జరీకు సుమారు రూ.70 వేలు వరకు ఖర్చవుతుందని అంచనా. 

ఇలాంటి సర్జరీలను వెంటనే ఆపాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలాంటి సర్జరీల వల్ల కన్యత్వం తప్పనిసరే అనే భావనను బలపరుస్తున్నట్లుగా ఉందని, అంతేగాక కన్యత్వ నిర్ధరణ పరీక్షలను కూడా నిలిపేయాలని బలంగా డిమాండ్ వినిపిస్తోంది. మన దేశంలో ఇలాంటి సర్జరీలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పెళ్లికి ముందు సెక్స్‌ను ఎంజాయ్ చేసే యూకే వంటి దేశాల్లో కూడా ఇలాంటి సర్జరీలు వందల సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  ‘హైమనోప్లాస్టీ’ సర్జరీలను నిషేదించాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

నకిలీ చికిత్సలతో మోసం: పెళ్లి కోసం, భవిష్యత్తు కోసం భయాందోళనలతో వైద్యులను సంప్రదించే అమ్మాయిలను కొంతమంది వైద్యులు మోసం చేస్తున్నారు. యూకేలో ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. వర్జినిటీ రిపైర్‌కు బదులు నకిలీ సర్జరీలు చేస్తున్నారు. ఇలాంటి చికిత్సలు చేస్తే.. వర్జినిటీ రిపైర్ సర్జరీలను  చట్టవిరుద్ధం చేస్తామని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) హెచ్చరించింది. కన్యత్వాన్ని పునరుద్ధరించే సర్జరీలను నిషేదించకపోతే.. కన్యత్వ పరీక్షలను బ్యాన్ చేయాలనే డిమాండ్‌‌కు అర్థం ఉండదని తెలిపింది. 

తొలిరాత్రి అమ్మాయి రక్తాన్ని స్రవిస్తే.. ఆమె కన్య అనే భావన కలుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు, బంధువులు బలవంతంగా ఇలాంటి ఆపరేషన్లు చేయిస్తు్న్నారని తెలిసింది. రక్తనాళలతో అత్యంత పలుచుగా ఉండే ఈ పొర పగిలినప్పుడు రక్తం కారుతుందని, కొందరికి పొర చీలినా రక్తస్రావం ఉండదని RCOG ప్రతినిధులు స్పష్టం చేశారు. కాబట్టి.. కన్నెపొరను కన్యత్వానికి ప్రామాణికంగా తీసుకోకూడదని తెలిపారు. అయితే, ఇప్పట్లో ఈ సర్జరీలను నిషేదించే ఆలోచనలో ప్రభుత్వాలు లేనట్లు తెలుస్తోంది.  

Also Read: ‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్

2020 సంవత్సరంలో ‘సండే టైమ్స్’ జరిపిన పరిశోధనలో యూకే అంతటా 22 ప్రైవేట్ క్లినిక్‌లు స్థానిక అనస్థీషియా కింద నిర్వహించే ప్రక్రియ కోసం £3,000 వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక సంవత్సరం వ్యవధిలో యూకేలో సుమారు 9,000 మంది ‘హైమెనోప్లాస్ట్’, సంబంధిత సర్జరీల కోసం గూగుల్‌లో శోధించారని పరిశోధనలో తెలిపారు. ఈ సందర్భంగా RCOG ప్రెసిడెంట్ డాక్టర్ ఎడ్వర్డ్ మోరిస్ ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘వర్జినిటీ రిపైర్, కన్యత్వ పరీక్షల విధానాన్ని నిషేదించాలని మేం కోరుతున్నాం. వీటి వల్ల ఎలాంటి వైద్య ప్రయోజనం లేదు. పైగా రెండూ హానికరమైన పద్ధతులు. ఇలాంటి సర్జరీలు సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తాయి’’ అని తెలిపారు. 

Also Read: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా మొదటిసారి సెక్స్‌లో పాల్గొనేప్పుడు హైమన్ పొర చిట్లాలనేది నమ్మకమైన సూచన కాదని, కన్యత్వ పరీక్షలు మానవ హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. IKWRO మహిళా హక్కుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డయానా మాట్లాడుతూ.. వైద్యులు ఇలాంటి సర్జరీల ద్వారా తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నారని, వైద్యులు తమ నైతిక మార్గదర్శకాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి సర్జరీల కోసం బలవంతం చేయకూడదని కోరారు. 

Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget