News
News
వీడియోలు ఆటలు
X

‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్

సుమారు రూ.14 లక్షలు వెచ్చించి తన పిరుదులకు సర్జరీ చేయించుకుంది. కానీ, బెడిసి కొట్టింది. ఇంతకీ ఆమె ఎందుకు కూర్చోలేకపోతోంది?

FOLLOW US: 
Share:

మోడలింగ్ లేదా రంగుల ప్రపంచంలో వెలగాలంటే.. అందమే కాదు, ఆకృతి కూడా బాగుండాలి. ముఖ్యంగా మహిళలకు అవి రెండూ ముఖ్యమే. అందుకే రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని కోరుకొనే చాలామంది మోడళ్లు, నటీమణులు.. సర్జరీలు చేయించుకుంటూ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల నుంచే కొంతమంది హీరోయిన్లు తమ ముఖాకృతులను మార్చుకున్నారు. పర్మినెంట్ మేకప్ సర్జరీలు కూడా చేయించుకున్నారనే టాక్ ఉంది. అయితే, ఇప్పుడు టెక్నాలజీ ఎంతో మారిపోయింది. కేవలం ముఖంలోనే కాదు.. శరీర ఆకృతిని కూడా మార్చేసే టెక్నాలజీ వచ్చేసింది. వక్షోజాల నుంచి పిరుదల వరకు ప్రతి ఒక్కటీ మార్చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్ఫ్లుయెన్సర్లలో చాలామంది ఈ బాటే పడుతున్నారు. తమ రూపురేఖలను మార్చేసుకుంటూ.. వాటిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత ఫ్యాన్ పేజీల్లో అందాలను ఆరబోస్తూ బాగానే సంపాదిస్తున్నారు. 

అయితే, ఫ్లోరిడాకు చెందిన మోడల్ సమస్యే వేరు. ఆమె కూడా అందరిలాగానే తన శరీర ఆకారాన్ని మార్చుకోవడం కోసం ఆరాటపడింది. సుమారు రూ.14 లక్షలు వెచ్చించి తన పిరుదులకు సర్జరీ చేయించుకుంది. అయితే, ఆ సర్జరీ ఫెయిల్ కావడంతో ఆమె ఇప్పుడు కూర్చోవాలంటేనే భయపడిపోతోంది. 24 ఏళ్ల  కజుమీ స్క్విర్ట్స్‌కు ఎదురైన చేదు అనుభవం ఇది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్లను ఆకట్టుకోవడం కోసం తన పిరుదులు ఎత్తుగా కనిపించేలా సర్జరీ చేయించుకుంది. అది ఫెయిల్ కావడం వల్ల ఆమె కూర్చోడానికి ఇబ్బంది పడుతోంది. 

ఈ సందర్భంగా కజుమీ మాట్లాడుతూ.. ‘‘సరైన శరీరాకృతి కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయమైన డైటింగ్, వ్యాయామాలు చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ, సాధ్యం కాలేదు. దీంతో సర్జరీ ద్వారా నా వక్షోజాలను పెంచుకున్నాను. ఆ తర్వాత బట్ లిఫ్ట్ సర్జరీ చేయించుకున్నాను. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. సర్జరీ విజయవంతం కాలేదు’’ అని తెలిపింది. అప్పటి నుంచి తాను కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నానని పేర్కొంది. 

Also Read: రియల్ పక్షిరాజా.. వీడియో తీస్తుంటే ఫోన్ ఎత్తుకెళ్లిపోయిన చిలుక, కెమేరాకు చిక్కిన ‘బర్డ్ వ్యూ’

‘‘నేను ఏ పనిచేసినా నిలబడే చేస్తాను. ఎక్కడైనా కూర్చోవాలంటే పెద్ద పెద్ద పిల్లోస్‌ను నా వెంట తీసుకెళ్తాను. డిన్నర్ చేసేప్పుడు అవి నాకు కాస్త సపోర్ట్‌గా ఉంటాయి. నా పిరుదల మీద ఏ మాత్రం ఒత్తిడి పడినా.. అక్కడి కొవ్వు పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే ఏడాదిగా నిలుచునే ఉంటున్నా’’ అని తెలిపింది. అయితే, ఆమె కూర్చోలేకపోయినా.. అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మారిన తన షేపులతోనే ‘ఓన్లీ ఫ్యాన్స్’ పేజ్ ద్వారా డబ్బులు గడిస్తోంది. సర్జరీకి ముందు కంటే ఇప్పుడే ఎక్కువగా సంపాదిస్తున్నానని ఆమె చెబుతోంది. ఒకప్పుడు నెలకు 25 వేల డాలర్లు మాత్రమే లభించేవని, సర్జరీ తర్వాత 2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నానని తెలిపింది. దీంతో.. ఆ డబ్బును అలా ‘వెనకేసుకొనే’ బదులు.. ‘వెనుక’ ఏదైనా సర్జరీ చేయించుకొని కూర్చోడానికి ప్రయత్నించు అని ఆమె ఫాలోవర్లు సలహా ఇస్తున్నారు. 

Also Read: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?

Published at : 27 Aug 2021 08:39 AM (IST) Tags: ఫ్లొరిడా Florida Florida Model Model Unable to Sit Model Unable to Sit down

సంబంధిత కథనాలు

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?

షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

టాప్ స్టోరీస్

Revant Reddy : సెప్టెంబర్ 17న మేనిఫెస్టో - ఖచ్చితంగా ధరణి రద్దు - రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revant Reddy :  సెప్టెంబర్ 17న మేనిఫెస్టో - ఖచ్చితంగా ధరణి రద్దు - రేవంత్ కీలక వ్యాఖ్యలు

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి