Afganisthan Crisis Update: కాబూల్ విమానాశ్రయంపై రాకెట్ల వర్షం.. 'డెడ్ లైన్'కు ముందు ఉద్రిక్తత
అఫ్గానిస్థాన్ వరుస దాడులతో అట్టుడుకుతోంది. ఈరోజు ఉదయం కాబూల్ విమానాశ్రయమే లక్ష్యంగా రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.
అఫ్గానిస్థాన్ లో రోజుకో పేలుడు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలో ఆదివారం ఓ దాడి జరిగింది. నేడు కాబుల్ విమానాశ్రయమే లక్ష్యంగా మళ్లీ రాకెట్ దాడులు జరిగాయి. సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. కాసేపటి తర్వాత వాటిని కూల్చేసిన శబ్దాలు వినిపించినట్లు చెప్పారు. వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్ల తెలుస్తోంది.
Afghanistan: As many as five rockets were fired at Kabul airport but were intercepted by a missile defense system, reports Reuters quoting a US official
— ANI (@ANI) August 30, 2021
5 రాకెట్లు..
ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి ప్రతిదాడి చేయడంతో అవి విమానాశ్రయం సమీపంలోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయాయి. అయితే రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేదానిపై ఇంకా సమాచారం రాలేదు. పేలుడు శబ్దాలతో ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న అఫ్గాన్ పౌరులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మొత్తం 5 రాకెట్లు ప్రయోగించినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం.
White House confirms rocket attack at Kabul airport, says operations continue uninterrupted pic.twitter.com/fNfkayOcqu
— ANI (@ANI) August 30, 2021
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం కూడా ఇలాంటి దాడి జరిగింది. విమానాశ్రయానికి ఒక కిలోమీటరు దూరంలోని ఖువ్జా బుఘ్రా ప్రాంతంలో రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిన్న కాబూల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా భగ్నం చేసింది.
డెడ్ లైన్..
నిన్న ఎయిర్‌పోర్టు వద్ద ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్ దాడి ద్వారా వారిని మట్టుబెట్టారు. అఫ్గాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ఆగస్టు 31తో ముగియనుంది. ఈ సమయంలో కాబూల్ లో వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.