అన్వేషించండి

Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు

Andhra News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్‌, అధికారులను ఎవరైనా బెదిరిస్తే సుమోటోగా కేసులు పెడతామని అన్నారు.

Deputy CM Pawan Kalyan Strong Warning: ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అధికారులకు ఎవరైనా వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని పునరుద్ఘాటించారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

'మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు'

20 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని మభ్యపెట్టి గత ప్రభుత్వంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని, రోడ్డు మీద నిరసనను చూస్తున్న మహిళలపై కూడా హత్యాయత్నం కేసులు పెట్టారని పవన్.. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుని సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలమని అంటున్నారు. డీజీపీని రిటైర్ అయినా వదలమంటున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదు. మీరు ఇంట్లో కూర్చుని రోడ్డు మీద ఆడబిడ్డలకు సంరక్షణ లేదని విమర్శలు చేస్తున్నారు. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు. ఇళ్లలోకి వచ్చి బిడ్డలను రేప్ చేస్తామని మాట్లాడారు. మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు. అధికారులపై చిన్న ఈగ వాలినా మీరే బాధ్యత వహించాలి. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా.?' అని నిలదీశారు.

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు..

'గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట ఇష్టానుసారం రోడ్ల పక్కన ఉన్న చెట్లు నరికేశారు. ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయి. ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. చెట్ల నరికివేత మీద చర్యలు మొదలుపెడితే వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఊహించనన్ని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. లా అండ్ ఆర్డర్ సమస్యలతో పాటు సరస్వతి పవర్ భూముల్లో 76 ఎకరాలు అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించేశారు. దీంతోపాటు వాగులు, వంకల సంరక్షణ బాధ్యత కూడా ఉంది. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నాం. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్ జోన్ ఏర్పాటు చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమలు కూడా లేవు. సరస్వతి పవర్ వ్యవహారంలో పాల్పడిన ఉల్లంఘనలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. విశాఖ నడిబొడ్డున గంజాయి పెంచుతున్నారు. భవిష్యత్తులో గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం.' అని పవన్ పేర్కొన్నారు.

అటవీ సంపద దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా మనం పని చేయాలని పవన్ అన్నారు. 'అటవీ సంపద పరిరక్షణలో ఒక ఐ.ఎఫ్.ఎస్. అధికారితో పాటు 23 మంది సిబ్బంది తమ ప్రాణాలు అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో అశువులు బాసిన వారి కుటుంబాలకు  ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి ప్రసాదించిన వన సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం.' అని పిలుపునిచ్చారు.

షర్మిలకు భద్రతపై..

ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు భద్రతపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె కోరితే భద్రత కల్పిస్తామని అన్నారు. మహిళల భద్రత విషయంలో సమాజంలో ప్రతిఒక్కరూ ముందుకు రావాలని చెప్పారు.

Also Read: Madanapalli News: ఆర్డీవో మురళీపై ప్రభుత్వం వేటు- ఆ కేసులో కాదు, అక్రమ ఆస్తుల కేసులో చర్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Telangana Ration Card Latest News:తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Kerala Crime News: ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన 23 ఏళ్ల యువకుడు - గర్ల్ ఫ్రెండ్‌నీ వదల్లేదు - తండ్రి వల్లనే..
ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన 23 ఏళ్ల యువకుడు - గర్ల్ ఫ్రెండ్‌నీ వదల్లేదు - తండ్రి వల్లనే..
CM Revanth Reddy: ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget