![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP MPs: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలి... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు... అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఎంపీలు
దిల్లీలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
![AP MPs: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలి... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు... అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఎంపీలు Delhi All party meet Andhra Pradesh MPs discussed about state issues AP MPs: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలి... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు... అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఎంపీలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/28/ff1b9520ffd7180bae4c07bb07b83d91_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ, టీడీపీ ఎంపీలు పాల్గోన్నారు. రాష్ట్ర సమస్యలను ఈ సమావేశంలో ప్రస్తావించామని ఎంపీలు మీడియా సమావేశంలో తెలిపారు. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో 24 పంటలకు మద్దతు ధర ఇస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పంటలకూ మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కనీస మద్దతు ధరపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్నారు. ఆహార భద్రత చట్టంలో ఏపీకి అన్యాయం జరిగిందని, అది సరిదిద్దాలని కోరినట్లు విజయసాయి పేర్కొన్నారు. కుల గణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్, దిశ బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను చెల్లించాలని లేకుండా కేంద్రమే భరించాలని అఖిలపక్ష భేటీలో కోరామని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
అమరావతే రాజధానిగా ఉండాలని కోరాం : టీడీపీ
వైసీపీ ఎంపీలు మాట్లాడిన అనంతరం టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై సమావేశంలో చర్చించామని టీడీపీ ఎంపీలు తెలిపారు. ఏపీలో పెట్రో ధరలు తగ్గించలేదని భేటీలో తెలిపామన్నారు. దేశమంతా పెట్రో ధరలు ఒకే విధంగా ఉండేలా సమీకృత విధానం తీసుకురావాలని కోరినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వద్దని కోరామన్నారు. అమరావతి రాజధాని ఉండేలా చూడాలని చేసినట్లు టీడీపీ ఎంపీలు వెల్లడించారు.
Also Read: వేదికపై పాదాభివందనం చేసిన రేవంత్ రెడ్డి.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
దిల్లీలో అరుదైన సన్నివేశం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ గా ఉంటాయి. ఎప్పుడూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటుంది. ఇలాంటి సమయంలో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. దిల్లీలో అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ఎంపీలు పాల్గోన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే టీడీపీ, వైసీపీ ఎంపీలు ఒకేచోట చేరారు. ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకున్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆహ్లాదంగా మాట్లాడారు. ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుకున్నారు.
Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)