అన్వేషించండి

Purandeswari: ఎలన్ మస్క్‌కు పురందేశ్వరి ఛాలెంజ్, దమ్ముంటే నిరూపించాలని సవాల్

Purandeswari Elon Musk News: ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి ఎలన్ మస్క్ కు అవకాశం ఇవ్వాలని పురందేశ్వరి ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ ఇంతకుముందు ఎంతో మంది ఈ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు.

AP Latest News: ఎక్స్ సీఈవో, అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్‌కు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఛాలెంజ్ చేశారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ఎలాన్ మస్క్ ను ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలని.. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ కు అవకాశమివ్వాలని పురందేశ్వరి సూచించారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ ఇప్పటికే చాలామందికి అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ అవకాశం ఎన్నికల సంఘం ఇచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి గుర్తు చేశారు.

అంతకుముందు ఎలన్ మస్క్ ఓ ఎక్స్‌లో ఓ పోస్టు చేస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎం) నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వీటిని మనుషులు లేదా ఏఐ ద్వారా హ్యాకింగ్ చేయొచ్చని అన్నారు. దీనికి కౌంటర్ గానే పురందేశ్వరి తాజాగా ఎలన్ మస్క్‌కు ఛాలెంజ్ విసిరారు. 

అమెరికాలోని ప్యూర్టోరికోలో కొంత కాలం క్రితం జరిగిన ప్రైమరీ ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎలాన్​ మస్క్ స్పందిస్తూ.. మనం ఈవీఎంలను తొలగించాలని పోస్ట్ చేశారు. దీనిపై మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా గట్టిగానే స్పందించారు. సెక్యూర్ డిజిటల్ హార్డ్ వేర్ ​ను తయారు చేయడం సాధ్యం కాదని మస్క్ మాట్లాడుతున్నారని.. అది తప్పని అన్నారు. అమెరికా సహా ఇతర దేశాలలో సాధారణ కంప్యూటర్ ప్లాట్ ఫాంను ​ను వాడి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంలను తయారు చేస్తుంటారని.. కానీ ఇండియాలో తయారుచేసే ఈవీఎంలు ఏ ఇతర నెట్‌వర్క్‌తో కనెక్ట్ కావని చెప్పారు. అంటే, ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై లాంటి కనెక్షన్ ఈవీఎంలకు ఉండబోదని చెప్పారు. కనీసం వాటిని రీప్రోగ్రామ్ చేసే వీలు కూడా ఉండదని పోస్ట్ చేశారు. 

ఈ విషయంపై జాతీయ వార్తా సంస్థలతో కూడా రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు. హ్యాకింగ్ ​కు అవకాశంలేని ఈవీఎంలను తయారుచేసుకోవాలనుకొనే దేశాలకు భారత్ శిక్షణ ఇవ్వడానికి రెడీ అని అన్నారు. థియరీ వేరు.. ప్రాక్టికల్ వేరని.. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా తాను ఏ లెవల్ ఎన్‌క్రిప్షన్ అయినా డీక్రిప్ట్ చేయగలనని అన్నారు. కానీ దీనికి, ఈవీఎంలకు సంబంధం లేదని అన్నారు. ఈవీఎంలు పూర్తిగా సేఫ్​ అని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. 

రాజీవ్ చంద్రశేఖర్ ప్రముఖ చిప్ డిజైనర్ కూడా. గుజరాత్‌కు చెందిన ఈయన మూడు సార్లు రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై 7 జులై 2021 నుంచి నరేంద్ర మోదీ కేబినెట్ స్కిల్ డెవలప్ మెంట్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Fake CBI Gang Arrested: సీబీఐ అధికారుల పేరుతో రియల్టర్ కిడ్నాప్.. రూ. 5 కోట్లు డిమాండ్!
సీబీఐ అధికారుల పేరుతో రియల్టర్ కిడ్నాప్.. రూ. 5 కోట్లు డిమాండ్!
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ACB Raids: అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
Ramayana Collections : రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Embed widget