అన్వేషించండి

CM Jagan : బాగా ఎదిగి రాష్ట్రానికి మేలు చేయాలి - విదేశీ విద్యాదీవెన లబ్దిదారులకు సీఎం జగన్ సూచన !

Andhra News : విదేశీ విద్యా దీవెన నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్రానికి మేలు చేయాలన్నారు.


CM Jagan released foreign education grant funds :    విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇవ్వడం జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇవ్వడం జరుగుతోంది.  దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 
 
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్ లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా మొత్తం  ఫీజు చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా అందిస్తున్నామన్నారు.  మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి. ఎక్కడో ఒక చోట కెరీర్ లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలని సూచించారు. 
 
ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు.  కార్నిగిమెలన్‌ యూనివర్సిటీలో రూప అనే విద్యార్థినికి రూ. 89 లక్షలు కంప్యూటర్ సైన్స్ ఫీజు చెల్లిస్తున్నామన్నరాు. సాంబశివ అనే విద్యార్థికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు, కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న  ప్రకీర్త్  కు 75.87 లక్షలు , వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో శ్రేయకు 70 లక్షలు ఫీజు చెల్లిస్తున్నామని తెలిపారు.   సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ ఫీజులు ఉన్నాయని..  అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.  ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ   సహాయ, సహకారాలు అందుతున్నాయని తెలిపారు.  ఎకనమికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారని సీఎం జగన్ తెలిపారు.  

మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు.  ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్‌కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు.. మొత్తంగా లక్షన్నర ఇచ్చేట్టుగా  పథకం తెచ్చామని సీఎం జగన్ తెలిపారు.  
ఈ రెండో కార్యక్రమం ద్వారా 95 మంది పిల్లలు నా తమ్ముళ్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నామన్నారు.  11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నామని.. గవర్నమెంట్ లో శాచురేషన్, ట్రాన్స్‌పరెన్సీ పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నానని తెలిాపరు. 

గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించినవి. ఫీజులు 60, 70 లక్షలు కనపడుతున్నాయి. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలా చేస్తే ఏ ఒక్కరికీ కూడా మంచి జరగదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదున్నారు.  ఎప్పుడూ బతుకులు మారవు. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లు నడిచిన కార్యక్రమాలవి. దాదాపు 3,326 మందికి 2016-17కు సంబంధించి రూ.318 కోట్లు బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీల ఎంపికలోనూ పారదర్శకత లేదన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Secret Wedding Misfires: విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
AP Helicopter Tours Controversy: ప్రజాధనంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ హెలికాప్టర్ టూర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు
ప్రజాధనంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ హెలికాప్టర్ టూర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget