అన్వేషించండి

YSRCP: మూడో జాబితాపై సీఎం జగన్ కసరత్తు - క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేల క్యూ !

YSRCP Candidates : వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల మూడో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు.

CM Jagan working on the third list :  సీఎం జగన్ మూడో జాబితాపై కసరత్తు చేస్తున్నారు.  ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం వచ్చారు. గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు సెగ్మెంట్‌లో ప్రత్యామ్నాయం పార్టీ హైకమాండ్ చూస్తున్నట్లు సమాచారం. దీంతో పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని విఙప్తి చేస్తున్నారు. సీఎంఓకు మైలవరం ఎమ్మెల్యే వసంత, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డి వచ్చారు.  సీఎం క్యాంపు కార్యాలయానికి దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వచ్చారు. పలు నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పులపై  సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2,3 రోజుల్లో 15 మందితో మూడో లిస్టును వైసీపీ విడుదల చేయనున్నట్లు సమాచారం.                             

అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికే కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యారు. అధికారం కోల్పోవద్దనే ఆలోచనలో గెలవని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫస్ట్‌, సెకండ్‌ లిస్టులను పార్టీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీమ్‌పై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.                

గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తే ..ఈసారి వారిలో కొందరికి గెలుపు అవకాశాలు లేవని సర్వేలో తేలడంతో జగన్ ఎమ్మెల్యేల పేర్లను, నియోజకవర్గాలను తారుమారు చేసి బరిలోకి దింపాలని చూస్తు్న్నా్రు. ఇందులో భాగంగానే మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని 11మందికి నియోజకవర్గ ఇన్చార్జులుగా ప్రకటించారు. అటుపై రెండో జాబితా కూడా విడుదల చేసి మిగిలిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలో 27మంది నేతలను మార్చింది వైసీపీ అధిష్టానం. ఇక ఇప్పుడు మూడో లిస్ట్ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈజాబితాలో కూడా 10-15మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు, పేర్లు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తులను అధిష్టానం బుజ్జగిస్తోంది. వారికి ఏదో విధంగా పదవులు కట్టబెడతామని హామీతో కూల్ చేస్తోంది. రెండోసారి అధికారంలో రావాలని జగన్ ఇస్తున్న ధైర్యంతో నియోజకవర్గాలు మార్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుుడు పోటీకి సై అంటున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Manchu Vishnu: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Voters Going to Home For Votes | AP Elections  | ఓట్ల పండుగ.. పల్లె బాట పట్టిన పట్నం | ABPSilence Period Before Polling | AP Elections 2024 | ప్రచారం బంద్.. ఇలా చేస్తే ఇక అంతే | ABP DesamOld City Power Bills Politics | పాతబస్తీలో కరెంట్ బిల్లుల వివాదంపై గ్రౌండ్ టాక్ | ABP DesamAmalapuram Public Talk | Elections 2024 | అమలాపురం ఓటర్లు ఏమంటున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Manchu Vishnu: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
Salt side effects: ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!
ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!
IPL 2024: వర్షం వల్ల ఆలస్యం, ముంబై ముందు మోస్తరు లక్ష్యం
వర్షం వల్ల kkr తో ఆలస్యం, ముంబై ముందు మోస్తరు లక్ష్యం
Simbu: శింబుపై నిర్మాత కేసు - ఆ సినిమాలో నటించొద్దంటూ ఫిర్యాదు
శింబుపై నిర్మాత కేసు - ఆ సినిమాలో నటించొద్దంటూ ఫిర్యాదు
Embed widget