అన్వేషించండి

Chandrababu Case : చంద్రబాబు పిటిషన్లపై వాయిదాలు కోరుతున్న సీఐడీ - ఏపీ హైకోర్టులో ఏం జరిగిందంటే ?

Chandrababu Case :చంద్రబాబు పిటిషన్లపై సీఐడీ వాయిదాలు కోరుతోంది. ముందస్తు బెయిల్ పిటిషన్లన్నింటి విషయంలో అదే కోరుతున్నారు.


Chandrababu Case :  అమరావతి: ఐఆర్‌ఆర్(IRR) అలైన్‌మెంట్ మార్పు కేసులో  టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) దాఖలు చేసిన  పిటిషన్‌పై విచారణను హైకోర్టు (High Court)ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్(Advacat General) విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌(Interim Bail)పై ఉన్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఈ కేసులో తాము  పీటీ వారెంట్‌పై ఒత్తిడి చేయబోమని ఏజీ చెప్పారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్య కారణాలతో  హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో  ప్రభుత్వం దాఖలు చేసిన వరుస కేసుల్లో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదాలు కోరుతోంది ప్రభుత్వం. 

సీఐడీ వరుస కేసులు - వెంటనే ముందస్తు బెయిల్ కోసం చందర్బాబు పిటిషన్లు   

మరో వైపు  ఏపీ సీఐడీ(AP CID) తనపై మోపిన ఇసుక కేసు(Sand Case)లో ముందస్తు బెయిల్(Bail) మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని కూడా తప్పు పట్టడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక(Free Sand Policy) ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఉచిత ఇసుక విధానంపై కేబినెట్‌(AP Cabinet)లో ముందు చర్చించలేదంటూ ఎఫ్‌ఐఆర్‌(FIR)లో సీఐడీ పేర్కొనడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ రేపు(బుధవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసులోనూ విచారణను సీఐడీ వాయిదా కోరే అవకాశం ఉంది. 

చంద్రబాబుపై దాఖలు చేస్తున్న కేసుల్లో కౌంటర్ల దాఖలకు సమయం అడుగుతున్న సీఐడీ 

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ముందు రోజే  మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతిచ్చారని సీఐడీ కేసు పెట్టింది. ఆయనను ఏ3(A3)గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.  ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చీఫ్(TDP Chief) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ కోరింది. దీంతో  ఎన్‌. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు(Mallikarjuna Rao) నవంబర్‌(November) 21కి వాయిదా వేశారు. ఇలా చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్న సీఐడీ  వాటిపై ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేస్తున్న పిటిషన్లపై విచారణలకు వాయిదాలు కోరుతోంది. 

ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు ఆపరేషన్ పూర్తి 

ఎల్వీప్రసాద్(LV Prasad Hospital) ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్(Eye Operation) పూర్తయింది. 45 నిమిషాల్లో ఎల్వీప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఎల్వీప్రసాద్ ఆస్పత్రి నుంచి కాన్వాయ్‌లో టీడీపీ చీఫ్ ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు.  జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరుగగా..  ఇప్పుడు కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది.  ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget