News
News
వీడియోలు ఆటలు
X

Chandrababu: దేవుడి సన్నిధిలో ఈ సంస్కృతి ఏంటి? పిచ్చి పట్టిందా? చంద్రబాబు మండిపాటు

గంగమ్మ జాతరలో ‘J గన్’ అని అలంకరణలో ఏర్పాటు చేయడం పిచ్చికి పరాకాష్ఠ అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

FOLLOW US: 
Share:

తిరుపతిలోని గంగమ్మ జాతరకు ఎంత ప్రాముఖ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద పండుగలా ఆ వేడుకను ప్రజలు జరుపుకుంటారు. అయితే, ఆ ఆలయ అలంకరణ ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. ఆలయం వెలుపల ద్వారానికి పూలతో చేసిన అలంకరణలో వైఎస్ఆర్ సీపీ జెండాలు కనిపించడం, J అనే ఇంగ్లిషు అక్షరంతో పాటు ఓ తుపాకీ గుర్తు ఉండడంతో ఈ వ్యవహారం మరింత పెద్దది అవుతోంది. ‘J గన్’ అని అలంకరణలో ఏర్పాటు చేయడం పిచ్చికి పరాకాష్ఠ అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అసలు ‘జే’ అనే అక్షరానికి గంగమ్మకు సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘‘తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ 'గన్' సంస్కృతి ఏంటి? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? 'J' అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా?’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అంతకు ముందు లోకేశ్ కూడా

నారా లోకేష్ కూడా అలంకరణ ఫోటోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేసి వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు. ‘‘దైవ‌ స‌న్నిధిలోనూ జ‌గ‌న్ గ్యాంగులు త‌మ నేర‌బుద్ధిని చూపించుకుంటున్నాయి. తిరుపతి గంగమ్మ గుడి ఆవరణలో  జ‌గ‌న్ పేరు వ‌చ్చేలా జె అక్ష‌రం, గ‌న్ బొమ్మ‌లొచ్చేలా పూల‌తో అలంక‌రించ‌డం చూస్తే, ఎంత‌గా బ‌రి తెగించారో తేట‌తెల్లమ‌వుతోంది. దేవాల‌యాల‌పై గ‌న్ బొమ్మ‌లు వేస్తున్నారంటే, ప్ర‌జ‌ల్నేకాదు, దేవుళ్ల‌నీ బెదిరిస్తున్నట్టే’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ‌ జాతరకు భక్తులు పోటెత్తారు.. చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గంగమ్మ దర్శనంకు భక్తులు విచ్చేస్తున్నారు.. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి అనూహ్యంగా భక్తుల తాకిడీ పెరగడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకు‌ండా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో సమీక్షించారు.. ఐతే ఈ ఒక్క రోజే మూడు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనానికి విచ్చేసినట్లు అధికారులు అంచనా వేశారు.. బుధవారం (మే 17) తెల్లవారి జామున 1.30 గంటలకు అమ్మ వారి విశ్వరూప దర్శనం, చెంప నరుకుడు ఘట్టాలతో గంగమ్మ జాతర పరిసమాప్తం కానుంది.

Published at : 16 May 2023 10:26 PM (IST) Tags: Chandrababu TDP Tirupati gangamma temple gangamma jatara gangamma temple decoration

సంబంధిత కథనాలు

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

టాప్ స్టోరీస్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!