అన్వేషించండి

Balakrishna On Akkinenni : అక్కినేని వివాదానికి బాలకృష్ణ మార్క్ ముగింపు - ఆయన వివరణ ఇదిగో

అక్కినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తనపై వస్తున్న విమర్శలకు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. ఏఎన్నార్ ను తాను కించ పర్చలేదని స్పష్టం చేశారు.

Balakrishna On Akkinenni :   అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.  హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన  అక్కినేని.., తొక్కినేని అంటూ వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు తనపై తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ చూపేవారన్నారు. తాను బాబాయ్ అని పిలుచుకునేవాడిని.. ఆయనపై ప్రేమ తనకు గుండెల్లో ఉంటుందన్నారు. పొగడ్తలకు పొంగి పోకూడనదే విషయాన్ని తాను అక్కినేని నాగేశ్వరరావు నుంచే నేర్చుకున్నానన్నరు. ఎన్టీఆర్‌ను ఎన్టీవోడు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసలో పిలుస్తూంటారు..అదంతా ఆయనపై చూపే అభిమానమేనని గుర్తు చేశారు. ఏదో ఫ్లో లో వచ్చిన మాటలను వక్రీకరించుకుని వ్యతిరేక ప్రచారం చేస్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని.. స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పెడితే మొదట .. అక్కినేని నాగేశ్వరరావుకే అవార్డు ఇచ్చామని గుర్తు చేశారు. 

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో వ్యాఖ్యలతో వివాదం

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు రచయితతో షాట్ గ్యాప్‌లో ఏం మాట్లాడుకునేవారమో వివరించారు. ఈ సందర్భంగా అక్కినేని... తొక్కినేని అనే మాటలు వాడారు. అయితే అక్కినేని తర్వాత ప్రాసలో తొక్కినేని అని పదం రావడంతో.. ఈ అంశం వివాదాస్పదమయింది. అలాగే ఆ రంగారావు అనే మాట కూడా వాడారు. దీంతో సోషల్ మీడియాలో బాలకృష్ణపై కొంత మంది విమర్శలు ప్రారంభించారు. అందులో రాజకీయం చొరబడటంతో వివాదం పెద్దదయిపోయింది. ఇదే సమయంలో  నాగ చైతన్య, అఖిల్ కూడా.. ఏఎన్నార్ లైవ్స్ ఆన్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కించపర్చడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడా బాలకృష్ణ పేరు పెట్టకపోయినా ఆ వివాదం ఉద్దేశించే అని స్పష్టం కావడంతో మరితం దుమారం రేగింది. 

ఎస్వీ రంగారావును కించపర్చలేదని స్పష్టం చేసిన కుటుంబసభ్యులు

మరో వైపు కాపు నాడు పేరుతో ఓ సంఘం కూడా... ఎస్వీ రంగారావును బాలకృష్ణ అవమానించారని ఆరోపణలు చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. అదే సమయంలో సాక్షి రంగారావు గారి సామాజికవర్గం వారు ఏమీ డిమాండ్ చేయరా అన్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. చివరికి ఎస్వీ రంగారావు కుటుంబీకులు వీడియో విడుదల చేశారు.  ఎస్వీరంగారావును బాలకృష్ణ కించపర్చలేదని.. ఈ విషయాన్ని వివాదం చేయవద్దని వీడియో విడుదల చేశారు. అసలు  బాలకృష్ణ ఏమీ అనకపోయినా అన్నట్లుగా  ప్రచారం చేయడం కరెక్ట్ కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఎస్వీఆర్ విషయంలో వివాదం సద్దుమణిగింది. 

బాలకృష్ణ వివరణపై అక్కినేని ఫ్యాన్స్  ఎలా స్పందిస్తారో ?

అక్కినేని ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారు. కూకట్ పల్లి అర్జున్ ధియేటర్ వద్ద ధర్నా కూడా చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఎలా స్పందిస్తారన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. అయితే చివరికి వివాదాన్ని బాలకృష్ణ తేలికగానే తీసుకున్నారు. ఫ్లో అన్నమాటలేనని ... దీన్ని వివాదం చేసుకుంటే.. తనకేం సంబంధం లేదని తేల్చారు. ఇప్పుడు అక్కినేని అభిమానులు ఎలా స్పందిస్తారో మరి..!

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Cyclone Arnab Live Updates: బుధవారం ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
బుధవారం ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
AP NTR Bharosa Pension: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ గ్రీన్ సిగ్నల్
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి AP SEC గ్రీన్ సిగ్నల్
AP Local Body Elections: సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పట్టణ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పట్టణ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget