AP Covid Vaccination: టీనేజర్ల వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు... జనవరి ఒకటి నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
రాష్ట్రంలో 15-18 ఏళ్ల వయసు వారికి జనవరి ఒకటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు జారీచేసింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రికాషనరీ డోస్, 15-18 ఏళ్ల టీనేజర్లకు వాక్సినేషన్ ప్రక్రియపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 15-18 ఏళ్లు టీనేజర్లకు జనవరి 1వ తేదీ నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు మధ్య గల వారికి జనవరి 3 నుంచి వాక్సినేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వైద్య ఆరోగ్య సిబ్బంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రికాషనరీ డోస్ ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు అందించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read: కాపు పార్టీ రాబోతోందా... ఈ మీటింగ్ దేనికి సంకేతం....?
విశాఖలో న్యూ ఇయర్ ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకలపై విశాఖలో ఆంక్షలు విధించినట్లు సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఆర్కే బీచ్ రోడ్డు మూసివేయనున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, బీఆర్టీఎస్ సహా ఇతర రోడ్లు క్లోజ్ చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, కేకులు కట్ చేయడం, ర్యాలీలు నిషేధించినట్లు తెలిపారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి బైకులపై తిరుగుతూ హడావుడి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెస్టారెంట్లు, వైన్ షాపులు నియమిత టైమింగ్ ప్రకారం తెరిచి ఉంచాలని, ఎక్కడా డీజేలకు అనుమతిలేదన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ చేసుకోవాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే పోలీస్ స్టేషన్లో న్యూ ఇయర్ రోజు గడపాల్సి వస్తుందన్నారు.
Also Read: సీఎం జగన్‌ను ఇక బ్రహ్మ కూడా జైలుకి పంపలేడు.. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
పశ్చిమగోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు
రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు రిపోర్ట్ అయింది. 21న కువైట్ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. 6,856 మంది విదేశాల నుంచి వస్తే వాళ్లలో అంతా నెగిటివ్ వచ్చాకే స్వగ్రామలకు వచ్చారని తెలిపారు. వీరిలో 8 రోజులు గడిచాక 14 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అందులో ప్రత్తికోళ్ల లంకకు చెందిన 41 ఏళ్ల మహిళలు ఒమిక్రాన్ వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తిస్తున్నారు. ఇంకా ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటే 8010968295 నెంబర్‌కు చెప్పాలని సూచించారు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. వెంటనే ట్రేస్ చేసి, టెస్ట్ చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండగలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు కార్తికేయ మిశ్రా. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని అందరూ విధిగా పాటించాలని రిక్వెస్ట్ చేశారు. జిల్లాలో లక్షా 75 వేల మంది 15-18 ఏళ్ల మధ్య పిల్లలు ఉన్నారని వాళ్లకు సోమవారం నుంచి టీకాలు వేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read: వంగవీటి రాధా ఆఫీసు వద్ద అనుమానాస్పద స్కూటర్ కలకలం ! ఎవరిది అది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి